భవిష్యత్తు: జూ.ఎన్టీఆర్ రాజకీయానికి పురంధేశ్వరి తోడు?

Published : Apr 09, 2019, 03:39 PM ISTUpdated : Apr 09, 2019, 03:42 PM IST
భవిష్యత్తు: జూ.ఎన్టీఆర్ రాజకీయానికి పురంధేశ్వరి తోడు?

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'RRR' సినిమాలో నటిస్తున్నాడు. సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నప్పటికీ ఈ మధ్యకాలంలో అనేక రాజకీయ చర్చల్లో ఎన్టీఆర్ పేరు బలంగా వినిపిస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'RRR' సినిమాలో నటిస్తున్నాడు. సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నప్పటికీ ఈ మధ్యకాలంలో అనేక రాజకీయ చర్చల్లో ఎన్టీఆర్ పేరు బలంగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాడని చాలా మంది భావిస్తున్నారు. టీడీపీ పార్టీకి సరైన నాయకుడు జూనియర్ ఎన్టీఆరే అంటూ సోషల్ మీడియాలో  అభిమానులు పోస్ట్ లు కూడా పెడుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బీజేపీ నేత, ఎన్టీఆర్ కి వరుసకు అత్త అయిన పురందరేశ్వరి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పురందరేశ్వరి.. ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందనే మాటలు బాగా వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన ఆమె ఇంతవరకు ఎన్టీఆర్ తో రాజకీయపరమైన విషయాలు మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు.

ఎన్టీఆర్ కి సినీ పరిశ్రమలో చాలా భవిష్యత్తు ఉందని, సినిమాల్లో కొనసాగుతానని జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సందర్భాల్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకి దిశా నిర్దేశం చేసే వ్యక్తిగా పురందరేశ్వరి ఉంటుందా..? అనే ప్రశ్నకి బదులిస్తూ.. అంతటి గౌరవం ఇస్తే స్వాగతిస్తానని చెప్పారు. అన్ని విషయాలు విడమరిచి చెప్పడం బాధ్యతగా భావిస్తానని అన్నారు. అడగకుండా మాత్రం ఉచిత సలహాలు ఇవ్వనని స్పష్టంగా తెలిపారు.

తాను ఏదైనా విషయాన్ని ఎన్టీఆర్ తో చెబితే దాన్ని అతడు గౌరవిస్తాడని పురందరేశ్వరి చెప్పారు. ఇదే ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ బయోపిక్ గురించి కూడా స్పందించారు పురందరేశ్వరి. చిన్నప్పటి నుండి నాన్నగారు ఎదుర్కొన్న కష్టాలను, ఒడిదుడుకులను కూడా సినిమాలో చూపించి ఉంటే బాగుండేదని అన్నారు.

బయోపిక్ అంటే అన్నీ చూపించాలని అన్నారు. రీసెంట్ గా విడుదలైన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా గురించి మాట్లాడుతూ.. ఆ సినిమాలో తాను లక్ష్మీపార్వతిని కొట్టినట్లు చూపించిన సన్నివేశాల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Vizag Roads Deserted During Sankranthi Festival: నిర్మానుష్యంగా వైజాగ్ రోడ్లు | Asianet News Telugu
Ambati on Sankranthi Song: నేను సంక్రాంతికి గుర్తురావడానికి కారణం Pawan Kalyan | Asianet News Telugu