యరపతినేని అనుచరుడి ఇంటిపై ఐటీ దాడులు

Published : Apr 09, 2019, 03:37 PM IST
యరపతినేని అనుచరుడి ఇంటిపై  ఐటీ దాడులు

సారాంశం

గుంటూరు జిల్లా గురజాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరుడు ఎంపీపీ కాంతారావు ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  

గురజాల: గుంటూరు జిల్లా గురజాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరుడు ఎంపీపీ కాంతారావు ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

మంగళవారం నాడు గుంటూరు జిల్లా గురజాలలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సభ జరుగుతున్న సమయంలోనే ఎంపీపీ కాంతారావు ఇంటిపై ఆయన ఆసుపత్రిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఇటీవలనే మైదుకూరు నుండి పోటీ చేస్తున్న పుట్టా సుధాకర్ యాదవ్, నెల్లూరు నుండి పోటీ చేస్తున్న పి. నారాయణ, కనిగిరి నుండి పోటీ చేస్తున్న ఉగ్ర నరసింహారెడ్డిల ఇళ్లపై ఐటీ సోదాలు జరిగాయి. తాజాగా కాంతారావు ఇల్లు, వ్యాపార సంస్థలపై ఐటీ సోదాలు నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.కేంద్రం తమ పార్టీ అభ్యర్థులపై ఐటీ దాడులు చేయిస్తోందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే