అక్రమ సంబంధం..భర్తను చంపిన భార్య.. యవజ్జీవ శిక్ష

Published : Jan 29, 2019, 10:57 AM IST
అక్రమ సంబంధం..భర్తను చంపిన భార్య.. యవజ్జీవ శిక్ష

సారాంశం

భర్తను అతి కిరాతకంగా హత్య చేసిన భార్య న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మహిళతోపాటు..ఆమెకు సహకరించిన ఆమె సోదరికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 

భర్తను అతి కిరాతకంగా హత్య చేసిన భార్య న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మహిళతోపాటు..ఆమెకు సహకరించిన ఆమె సోదరికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. రూ.100 జరిమానా కూడా విధించారు. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుమ్మల సుజాత, వెంకటరమణ మూర్తి దంపతులు దొండపర్తిలో నివాసం ఉండేవారు. సుజాత ప్రైవేటు స్కూల్ టీచర్ కాగా.. మూర్తి రోజువారి కూలీ పనులు చేసుకునేవాడు. కాగా.. సుజాత పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం మూర్తికి కలిగింది. దీంతో.. భార్యను నిలదీశాడు.

అయితే.. భర్త అలా తనను నిలదీయడం సుజాతకు నచ్చలేదు. వెంటనే తన సోదరి సహకారంతో.. భర్త తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. ఆ భోజనం తిని.. అతను నిద్రలోకి జారుకున్న తర్వాత.. దిండుతో ముఖంపై వెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఈ సంఘటన 2010లో చోటుచేసుకోగా.. ఈ కేసుకు సంబంధించి సోమవారం కోర్టు తీర్పువెలువరించింది. సుజాత, ఆమె సోదరికి శ్రీలక్ష్మికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్