పుంగనూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

Siva Kodati |  
Published : Mar 26, 2024, 03:18 PM ISTUpdated : Mar 26, 2024, 03:19 PM IST
పుంగనూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

తెలుగుదేశం పార్టీ 1983లో ఆవిర్భవించిన నాటి నుంచి 1996 వరకు పుంగనూరులో ఓడిపోలేదు. తొలుత కాంగ్రెస్ ఆ తర్వాత టీడీపీలకు పుంగనూరు కంచుకోటగా నిలిచింది. పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సోదం, సోమల, చౌడేపల్లి, పుంగనూరు, పులిచర్ల, రొంపిచర్ల మండలాలున్నాయి.  పుంగనూరులో విజయం సీఎం వైఎస్ జగన్‌తో పాటు మంత్రి పెద్దిరెడ్డికి కూడా ప్రతిష్టాత్మకం. దీనిపై పట్టు కోల్పోకూడదని వారిద్దరూ గట్టి పట్టుదలతో వున్నారు. టీడీపీ విషయానికి వస్తే పుంగనూరులో టీడీపీ గెలిచి 20 ఏళ్లు కావొస్తోంది. 2004లో చివరిసారిగా అమర్‌నాథ్ రెడ్డి విజయం సాధించారు. పుంగనూరులో టీడీపీ అభ్యర్ధిగా చల్లా రామచంద్రారెడ్డి (బాబు)కి టికెట్ కేటాయించారు. కొత్తగా పార్టీ స్థాపించిన బోడే రామచంద్ర యాదవ్ కూడా పుంగనూరులో పోటీ చేస్తున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో పుంగనూరు ఒకటి. ఎన్నికల ప్రస్తావన ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా ఈ సెగ్మెంట్ గురించి ఖచ్చితంగా చర్చకు వస్తుంది. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గానిదే ఆధిపత్యం. తొలుత కాంగ్రెస్ ఆ తర్వాత టీడీపీలకు పుంగనూరు కంచుకోటగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, టీడీపీ 6 సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు ఒకసారి విజయం సాధించారు.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ 1983లో ఆవిర్భవించిన నాటి నుంచి 1996 వరకు పుంగనూరులో ఓడిపోలేదు. టీడీపీ జైత్రయాత్రకు 1999లో బ్రేక్ పడింది. తిరిగి 2004లో విజయం సాధించినా ఆ తర్వాత పెద్దిరెడ్డి ఎంట్రీతో సైకిల్‌‌కు కష్టాలు మొదలయ్యాయి . ఆయన అంతకుముందు పీలేరులో మూడు సార్లు, పుంగనూరులో మరో మూడు సార్లు గెలిచారు. 2009 వరకు కాంగ్రెస్ నేతగా వున్న పెద్దిరెడ్డి.. వైఎస్ మరణం తర్వాత వైసీపీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో గెలిచి పుంగనూరులో హ్యాట్రిక్ కొట్టారు. 

పుంగనూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024.. కాంగ్రెస్, టీడీపీలకు కంచుకోట :

1952లో ఏర్పడిన పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సోదం, సోమల, చౌడేపల్లి, పుంగనూరు, పులిచర్ల, రొంపిచర్ల మండలాలున్నాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా రొంపిచర్ల, సోదం, పులిచర్ల, సోమల మండలాలు పుంగనూరు నియోజకవర్గంలో కలిశాయి. రెడ్డి, ముస్లిం, బలిజ, దళిత వర్గాల ప్రభావం ఎక్కువ. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 1,07,431 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి అనేషా రెడ్డికి 63,876 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా పెద్దిరెడ్డి 16,452 ఓట్ల మెజారిటీతో పుంగనూరులో హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు. 

2024 ఎన్నికల విషయానికి వస్తే.. పుంగనూరులో విజయం సీఎం వైఎస్ జగన్‌తో పాటు మంత్రి పెద్దిరెడ్డికి కూడా ప్రతిష్టాత్మకం. దీనిపై పట్టు కోల్పోకూడదని వారిద్దరూ గట్టి పట్టుదలతో వున్నారు. 2024లో మరోసారి రామచంద్రారెడ్డి బరిలో దిగుతున్నారు. టీడీపీ విషయానికి వస్తే పుంగనూరులో టీడీపీ గెలిచి 20 ఏళ్లు కావొస్తోంది. 2004లో చివరిసారిగా అమర్‌నాథ్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాతి నుంచి పుంగనూరు తెలుగుదేశానికి కొరకరాని కొయ్యగా మారింది. 

పుంగనూరు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. పెద్దిరెడ్డికి చెక్ పెట్టగలరా :

పెద్దిరెడ్డి రాజకీయ అనుభవం, వ్యూహాలను బట్టి చూస్తే ఆయనను ఇక్కడ ఎదుర్కోవడం అంత సులభం కాదు. అయితే ఈసారి జగన్ పాలనపై వ్యతిరేకత, మంత్రి పెద్దిరెడ్డి పెత్తనం, టీడీపీ జనసేన బీజేపీ కూటమి కారణంగా తెలుగుదేశం గెలుస్తుందని ఆ పార్టీ కేడర్ ధీమాగా వుంది. పుంగనూరులో టీడీపీ అభ్యర్ధిగా చల్లా రామచంద్రారెడ్డి (బాబు)కి టికెట్ కేటాయించారు. అలాగే కొత్తగా పార్టీ స్థాపించిన బోడే రామచంద్ర యాదవ్ కూడా పుంగనూరులో పోటీ చేస్తున్నారు. యాదవ, ఇతర బీసీ వర్గాలు తనకు అండగా వున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu