విరిగిపడిన పులిచింతల ప్రాజెక్టు గేట్: దిగువ గ్రామాల ప్రజలకు హెచ్చరిక

By telugu teamFirst Published Aug 5, 2021, 7:14 AM IST
Highlights

పులిచింతల ప్రాజెక్టు 16వ గేట్ విరిగిపోయింది. దీంతో దిగువకు నీరు పారుతోంది. ఎమర్జెన్సీ గేట్ ను ఏర్పటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దిగువ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

అమరావతి: పులిచింతల ప్రాజెక్టు 16వ గేట్ విరిగిపడింది. దిగువకు నీరు విడుదల చేయడానికి గేట్లు ఎత్తుతున్న క్రమంలో ఆ గేట్ విరిగిపోయింది. దీంతో ఎమర్జెన్సీ గేట్ ను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. దిగువ గ్రామాల ప్రజలను హెచ్చరించారు. 

పులిచింతల ప్రాజెక్టు కృష్ణా నదిపై నిర్మితమైంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయడంతో పులిచింతలకు పెద్ద యెత్తున నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయడానికి అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే 16వ గేట్ విరిగిపోయింది.

విరిగిపోయిన గేటు నుంచి దిగువకు నీరు పారుతోంది. దానిపై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రాజెక్టు ఇతర గేట్లను ఎత్తేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. విరిగిపడిన గేట్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు కింది పారుతున్నట్లు అంచనా వేస్తున్నారు 

click me!