కోవిడ్ సెంటర్‌లో మెడికల్ సర్వీసెస్‌దే మా బాధ్యత: రమేష్ ఆసుపత్రి ఎండీ

By narsimha lode  |  First Published Aug 10, 2020, 2:37 PM IST

కోవిడ్ సెంటర్ లో మెడికల్ సర్వీసెస్ మాత్రమే తాము చూసుకొంటామని రమేష్ ఆసుపత్రి ఎండీ  రమేష్ స్పష్టం చేశారు. 



విజయవాడ:కోవిడ్ సెంటర్ లో మెడికల్ సర్వీసెస్ మాత్రమే తాము చూసుకొంటామని రమేష్ ఆసుపత్రి ఎండీ  రమేష్ స్పష్టం చేశారు. 

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఆదివారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో 10 మంది కరోనా రోగులు మరణించారు. ఈ ప్రమాదంపై  రమేష్ ఆసుపత్రి ఎండీ సోమవారం నాడు వివరణ ఇచ్చారు.హోటల్ లో సౌకర్యాలన్నీ హోటల్ యాజమాన్యం చూసుకోవాలనేది తమ మధ్య ఒప్పందమని ఆయన గుర్తు చేశారు

Latest Videos

undefined

also read:విజయవాడ కోవిడ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం: స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆసుపత్రిపై కేసులు

స్వర్ణ ప్యాలెస్ ఘటనలో 10 మంది మరణించడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు ఆసుపత్రి ఎండీ.ఆరు నెలలుగా కోవిడ్ కేర్ సెంటర్ నడుపుతున్నామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.  రెండు ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకొని కోవిడ్ సెంటర్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించారని   ఫైర్ అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తు చేశారు.

ఈ ఘటన జరిగిన తర్వాత మంత్రులు అధికారుల బృందం  ఆదివారం నాడు స్వర్ణ ప్యాలెస్ ను సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారుల నుండి అడిగి తెలుసుకొన్నారు. 

click me!