రోజా అలా చేసినా కేసులుండవా..?: పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 10, 2020, 12:33 PM IST
Highlights

వైసిపి ప్రభుత్వం ఈ రోజు పోలీస్ వ్యవస్థ ను అడ్డుపెట్టుకోని ప్రతిపక్షాలను అణగద్రొక్కాలి అనే దృక్పథంతో ముందుకు వెళుతోందని మాజీ మంత్రి,  పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. 

గుంటూరు: వైసిపి ప్రభుత్వం ఈ రోజు పోలీస్ వ్యవస్థ ను అడ్డుపెట్టుకోని ప్రతిపక్షాలను అణగద్రొక్కాలి అనే దృక్పథంతో ముందుకు వెళుతోందని మాజీ మంత్రి,  పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఎవరైతే చురుకుగా ఉండి పాలక పక్షం తప్పులను ఎత్తి చూపుతున్న వారిని టార్గెట్ చేసి కేసులు పెట్టి జైలుకు పంపించడం జరుగుతోందన్నారు. మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డిని బెయిల్ పై విడుదలయిన 24గంటల్లోనే సీఐతో వాగ్వివాదం చేశారన్న నెపంతో మరల రిమాండ్ చేయడం దారుణమన్నారు. 

''కానీ వైసిపి ఎమ్మెల్యే రోజా గాని, మధుసూదన్ రెడ్డి గాని రోడ్ల మీద పడి ఊరేగింపులు చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కేసులు పెట్టుకోవడం శోచనీయం. ప్రతిపక్ష నాయకులను మాత్రమే టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళుతుంది. తప్పు చేయక పోయిన ప్రతిపక్షాలను కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తూ ఈ రోజు రాష్ట్ర పరిపాలన సాగుతోంది'' అని అన్నారు. 

వీడియో

"

''గుంటూరులో ఒక మైనార్టీ వ్యక్తి మీద గుంటూరు సిఐ దుర్భాషలాడటం వంటి విషయాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అదేవిధంగా రాజమండ్రి సీతానగరంలో ఇసుక తరలింపును నిలువరించాడు అనే కారణంతో ఒక దళిత యువకుడుకి పోలీసులే శిరోముండనం చేయిస్తే వాటిపై సరియైన చర్యలు చేపట్టకపోవడం ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిదర్శనం'' అన్నారు. 

''రాష్ట్రంలో మానభంగాలు, హత్యలు జరుగుతున్నా చూస్తూ ఉరుకోవడం తప్ప ప్రభుత్వం సీరియస్ గా ఏవిధమైన చర్యలు చేపట్టడం లేదు. ఈ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించి అన్ని విధాలుగా ప్రతిపక్షాలను అణగద్రొక్కాలి అనే లక్ష్యంతో వ్యవహరిస్తోంది'' అని చినరాజప్ప మండిపడ్డారు. 
 

click me!