బాబుకు దావోస్ 'ఆహ్వానం" , ఇదిగో సాక్ష్యం

First Published Jan 23, 2017, 6:39 AM IST
Highlights

దావోస్ డ్రామా  ‘ప్రింట్’కు అందని మైక్రో వ్యవహారం. అందుకే  ‘డిజిటల్‘ కోడై కూసింది. అందరిని నిద్ర లేపింది.

గత నాలుగయిదు రోజులగా అడ్రసుకూడా లేని  సోషల్ మీడియా ఒకటే  గోల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దావోస్  వరల్డ్ ఎకనమిక్ ఫోరం  సదస్సుకు అహ్వానం రాలేదని.

 

ఆయనే తెప్పించుకున్నాడని, దానికి బాగా ఖర్చయిందని ఒక "రాత". ఏ సదస్సులో  ఆయన  స్పీకర్ కాదు, అసలాయన్ని ఎవరూ పట్టించుకోలేదని మరొక "కోత".

అంతేకాదు ,ఆయన కాన్ఫరెన్స్ హాల్లో  కాకుండా, పక్కన  హోటల్లో దిగి,ఆంధ్ర మెస్ ఏర్పాటు చేసి,కోటేసుకున్న ప్రతివాడినిపట్టుకుని, ‘అమరావతికిరా ,పీజ్!’  అని బతిమాలుతున్నట్లు పోస్టులు.

 

అంతేకాదు, వర్ ల్డ్ ఎకనమిక్ ఫోరం వెబ్ సైటంతా గాలించి,  జనవరి 17- 20 నుంచి జరిగే సదస్సులో మాట్లాడే వాళ్ల పేర్లన్ని వెదికి, ఎక్కడ ముఖ్యమంత్రి పేరే లేదని  నిప్పులాంటి  నాయుడిగారి మీద నిందలు.

 

అయితే, సోషల్ మీడియాకు అడ్రసంటూ లేకపోయినా, దెబ్బతీయ గల శక్తి మాత్రం దండిగా ఉంది. దీనితో దిక్కుమాలిన  సోషల్ మీడియా అంటూ  ఈ పోస్టులను  గాలికి వదిలేసే పరిస్థితిలేదు. అదంత మంచిదికాదని ముఖ్యమంత్రిగారి కార్యాలయం భావించింది.  వెంటనే సోషల్ మీడియాకు వివరణ ఇచ్చింది.

 

ముఖ్యమంత్రికి ఆహ్వానం వచ్చింది, ఇవిగోసాక్ష్యాలంటూ  రెండు డాక్యుమెంట్లను బాబుగారి కమ్యూనికేషన్ అడ్వయిజర్  ఈ డాక్యుమెంట్లనుపంపించారు. ఆయన్నికీనోట్ అడ్రసు ఇవ్వనున్నారని చెపినపుడు దాదాపు మూడొందల మంది దాకా ఉన్న ప్రధాన వక్తల జాబితాలో ముఖ్యమంత్రి పేరేందుకు లేదనే ప్రశ్నకు సమాధానం లేదు.

ముఖ్యమంత్రి అక్కడ జరిపిన చర్చలకు దావోస్ సదస్సుకు సంబంధం లేదు. ఉత్తరాలు రాసి  ఆ సంస్థలను ప్రతినిధులను అమరావతి ఆహ్వనించవచ్చు. అంతెందుకు, వాళ్లజాబితాలో అమరావతి, నాయుడిగారి పేరు ఉంటే, వారేపరిగెత్తుకుంటూ వచ్చి, ఫలానా చోట యూనిట్ పెడతాం,భూమి వ్వండి బాబు అని బతిమాలాలి.  కాని ఇక్కడంతా రివర్స్లో జరుగుతూ ఉంది.

ఇది ‘ప్రింట్’కు అందని మైక్రో వ్యవహారం. అందుకే  ‘డిజిటల్‘ కోడై కూసింది. అందరిని నిద్ర లేపింది.

 

click me!