చంద్రబాబు నాయుడి మాటల మైలురాళ్లు...

First Published Jan 23, 2017, 4:23 AM IST
Highlights

అమరావతిని ప్రపంచస్థాయి రాజధాని చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచమంతా ప్రత్యేక విమానాలలో తిరుగుతున్నారు.ఆయన తాపత్రయం అర్థం చేసుకునేందుకు ఇదొక చిన్న ప్రయత్నం.

ముఖ్యమంత్రి చంద్రబాబు  విదేశీ పర్యటనలు తెలుగువాళ్లెపుడూ మరచిపోలేని ఘట్టాలు. ఒక్కొక్క దేశంలో ఉన్నపుడు ఒక్కొక్క మైలురాయిప్రకటనచేస్తారు.  ఇపుడుదావోస్ పర్యటన ఇందులో చాాలా ముఖ్యమయినది. పిలిచిన పిలవకపోయినా అక్కడికి ఎలా వెళ్లాలో ఆయనకు తెలుసు. దావోస్ నుంచి ఇన్వెస్ట్ మెంట్లు  వచ్చినా రాకపోయినా, ఎలాంటి ప్రకటన చేయాలో కూడా తెలుసు. ఏ ప్రకటన చేసినా అదొక మైలురాయి.  ఈ కోవలో ఆయన జరిపిన కొన్ని ముఖ్యమయిన పర్యటనలు, అక్కడ నిలబెట్టిన మ ాటల మైలు రాళ్లివి.  

 

2014 నవంబర్ 12 -- 3 రొజుల సింగపూర్ పర్యటన
చెప్పిన మాట -- జిల్లాకి ఒక విమానాశ్రయం

 

2014 నవంబర్ 24 -- 6 రొజుల జపాన్ పర్యటన
చెప్పిన మాట -- రాష్ట్రంలో  విద్యాలయాలలొ జపాన్ భాష

 

2015 జనవరి 20 - 4 రొజుల దావొస్ పర్యటన
చెప్పిన మాట -- స్పెయిన్ బుల్లెట్ రైలు పై అద్యాయనం ,ఇంక పెట్టుబడుల వెల్లువ

 

2015 ఏప్రిల్ 12 -- 6 రొజుల చైనా పర్యటన
చెప్పిన మాట -- షాంగై తరహలో  అమరావతి

 

2015 జులై 5 - 3 రొజుల జపాన్ పర్యటన
చెప్పిన మాట -- టొక్యొో స్థాయి లో అమరావతి నిర్మాణం

 

2015 ఆగస్టు 3 - 6 రొజుల టర్కి పర్యటన
ఫ్యామిలి ట్రిప్ - ఇస్తాంబుల్ తరహా లొ అమారావతి

 

2015 సెప్టెంబర్ 20 - 3 రొజుల సింగపూర్ పర్యటన
చెప్పిన మాట -- విశ్వనగరం గా అమరావతి , సింగపూర్లా తుళ్ళూరు.

 

2016 జనవరి 20 - 4 రొజుల దావొస్ పర్యటన
చెప్పిన మాట -- ఇంక విదేశీ పెట్టుబడుల వరద

 

2016 మార్చ్ 11 - 3 రొజుల లండన్ పర్యటన
చెప్పిన మాట -- అమరావతిలో లండన్ -ఐ

 

 

2016 మే 8 - 6 రొజుల తాయిలాండ్ , స్విజ్జర్లాండ్ పర్యటన
కుటుంబ తొ వెళ్ళి పర్యటన వివరాలలో గొప్యత పాటించారు

 

2016 జూన్ 27 - 5 రొజుల చైనా పర్యటన
చెప్పిన మాట - రాష్ట్రానికి బుల్లెట్ రైలు

2016 జులై 9 - 2 రొజు ఖజకిస్తాన్, ఆస్తాన పర్యటన
చెప్పిన మాట - కెబుల్ కార్లు తెస్తాం

2016 జులై 11 - 3 రొజుల రష్యా పర్యటన
చెప్పిన మాట -- రాష్ట్రం లో మెరైన్  వర్సిటి

2017 జనవరి 8 - 2 రొజుల శ్రీలంక పర్యటన
చెప్పిన మాట - అమరావతి కి శ్రీలంక మాస్టర్ ప్లాన్

 

2017 జనవరి 16 - దావొస్ పర్యటన
చెప్పిన మాట - విశాఖలో స్టాడ్లర్ రైలింజన్ల తయారీ, మాస్టర్ కారిడార్ టెక్నాలజీ

ఈ మైలురాళ్లు చెప్పే కథలందరికి తెలిసినవే...  
 

click me!