గుంటూరులో ఘోరం... అతివేగంతో కార్లపైకి దూసుకెళ్లిన లారీ, తృటిలో తప్పిన ప్రాణనష్టం (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Oct 29, 2021, 09:42 AM ISTUpdated : Oct 29, 2021, 10:50 AM IST
గుంటూరులో ఘోరం... అతివేగంతో కార్లపైకి దూసుకెళ్లిన లారీ, తృటిలో తప్పిన ప్రాణనష్టం (వీడియో)

సారాంశం

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కాజా టోల్ ప్లాజా వద్ద మితిమీరిన వేగంతో వచ్చిన ఓ లారీ రెండు కార్లపైకి దూసుకెళ్లింది.  

గుంటూరు జిల్లాలోని కాజా టోల్ ప్లాజా వద్ద ఓ లారీ భీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చిన లారీ అదుపుతప్పి టోల్ ప్లాజా వద్ద ఆగిన రెండు కార్లపైకి దూసుకెళ్ళింది. అయితే ప్రమాదం భయంకరంగా జరిగినప్పటికి కార్లలోని వారు చిన్నచిన్న గాయాలతో సురక్షితంగా భయటపడ్డారు.   

ఈ ప్రమాదంలో ఇన్నోవా, క్రెటా కారు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో క్రెటా కారులో ఏడాదిలోపు చిన్నారితో పాటు తల్లి, సోదరుడు, మరో వ్యక్తి... ఇన్నోవా కారులో మరో నలుగురు వున్నారు. వీరంతా ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. ఈ Accident లో కొందరికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. 

read more  లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 11 మంది దుర్మరణం.. రంగంలోకి ఆర్మీ

లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని బాధితులతో పాటు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లారీ పైకిదూసుకువచ్చిన సమయంలో ఈ రెండు కార్ల డ్రైవర్లు అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీని అక్కడే వదిలి డ్రైవర్ పరారయ్యాడు.   

వీడియో

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కార్ల యజమానులతో పాటు ప్రయాణికుల ఫిర్యాదుతో మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమై పరారీలో వున్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Tirumala Vaikunta Dwaram: టికెట్ లేని భక్తులకు ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు| Asianet News Telugu
ఫ్యూచర్ కోసం ఈ ఏడాది రిజల్యూషన్ తీసుకుందాం: Doctor Ratna Pemmasani | Plastic | Asianet News Telugu