ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని చెప్పారు.
అమరావతి: పరిపాలన చేతగానప్పుడు ఇంట్లో కూర్చోవాలని జనసేన (jana sena)పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ (nadendla manohar) ఏపీ సీఎం వైఎస్ జగన్ పై (Ys jagan) విమర్శలు గుప్పించారు.బుధవారం నాడు మంగళగిరిలో(mangalagiri) జరిగిన జనసేన విస్తృతస్తాయి సమావేశంలో నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు.మూడు నాలుగు రోజులుగా చోటు చేసుకొన్న పరిణామాలు తనను ఆవేదనకు గురి చేశాయని ఆయన చెప్పారు.కోవిడ్ సమయంలో సీఎం జగన్ ఏ ఒక్క ప్రాంతానికైనా వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేశాడా అని ఆయన ప్రశ్నించారు.
also read:పవన్‌పై వ్యక్తిగత విమర్శలెందుకు, మూర్ఖులే అలా మాట్లాడుతున్నారు: వైసీపీపై నాదెండ్ల ఫైర్
ఏపీలో జనసేననే ప్రతిపక్షపార్టీ అని ఆయన చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల గురించి అడిగితే ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని ఆయన జగన్ ను ప్రశ్నించారు.స్వప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీని కలవలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ ప్రధానిని కలిశారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.పనికిమాలిన వ్యక్తులను రెచ్చగొట్టి దాడులకు కారణమౌతున్నారని ఆయన మండిపడ్డారు. అక్టోబర్ రెండున రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదానం చేసి రోడ్లను బాగు చేయాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు.