కష్టాల్లో నంద్యాల ఎంఎల్ఏ

First Published Apr 3, 2018, 12:30 PM IST
Highlights
వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కోసం రోజురోజుకు పోటీ పెరిగిపోతోంది.

టిడిపి నంద్యాల ఎంఎల్ఏ భూమా బ్రహ్మానందరెడ్డిని ఒక్కసారిగా సమస్యలు చుట్టుముడుతున్నాయ్. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కోసం రోజురోజుకు పోటీ పెరిగిపోతోంది. మొన్నటి ఉపఎన్నికలో బ్రహ్మానందరెడ్డి గెలిచినా ఎంఎల్ఏని ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు. ఎందుకంటే, మంత్రి, సోదరి భూమా అఖిలప్రియ మీదున్న కోపంతో మిగిలిన నేతలందరూ ఎంఎల్ఏని కూడా దూరం పెట్టేశారు.

దాంతో మంత్రిలాగ ఎంఎల్ఏ కూడా ఒంటరైపోయారు. పనులు కూడా పెద్దగా జరగటం లేదు. దాంతో ఎంఎల్ఏని ఎవరూ పట్టించుకోవటం లేదు. దాంతో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టిక్కెట్టు దక్కేది కూడా అనుమానమే అన్న ప్రచారం బాగా ఊపందుకున్నది.

ఇటువంటి పరిస్ధితుల్లో వచ్చే ఎన్నికలో నంద్యాల నుండి పోటీ చేయటానికి పోటీదారులు ఎక్కువైపోతున్నారు. నంద్యాల ఫిరాయింపు ఎంపి ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ, తన అల్లుడు శ్రీధర్ రెడ్డికి నంద్యాల అసెంబ్లీ టిక్కెట్టు కావాలని ప్రకటించారు.

అంటే మామగారేమో నంద్యాల ఎంపిగా పోటీ చేస్తారట, అల్లుడేమో ఎంఎల్ఏగా పోటీ చేయాలట. మొత్తం మీద చాలా నియోజకవర్గాల్లో టిడిపిలో అంతర్గత కుమ్ములాటలైతే తీవ్రంగానే ఉంది. చంద్రబాబునాయుడు ఎలా పరిష్కరిస్తారో చూడాల్సిందే.

 

click me!