విజయవాడ: ప్రైవేట్ బస్సులో మంటలు.. యాక్సిడెంట్‌లో సీజ్, 4 నెలలుగా అక్కడే

Siva Kodati |  
Published : Apr 02, 2022, 09:55 PM IST
విజయవాడ: ప్రైవేట్ బస్సులో మంటలు.. యాక్సిడెంట్‌లో సీజ్, 4 నెలలుగా అక్కడే

సారాంశం

విజయవాడ శివార్లలోని గూడవల్లిలో జాతీయ రహదారి పక్కన ఆగివున్న బస్సులో అగ్ని  ప్రమాదం సంభవించింది. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. 

విజయవాడ (vijayawada) రూరల్ మండలం గూడవల్లి (gudavalli) వద్ద అగ్నిప్రమాదం (fire accident) చోటు చేసుకుంది. ఆగివున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తి దగ్ధమైంది. మరోవైపు 4 నెలల క్రితం కేసరపల్లి వద్ద బైక్‌ను ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందన ఘటనలో ఈ బస్సును పోలీసులు సీజ్ చేసి పక్కన పార్క్ చేశారు. ప్రస్తుతం గూడవల్లి వద్ద జాతీయ రహదారి ప్రక్కన నిర్మానుష్య ప్రదేశంలో బస్సు ఉండటం, తాజాగా అగ్నిప్రమాదం సంభవించడంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏపీలో హైటెక్ సిటీ, 400కే కిలో మ‌ట‌న్‌, ఓయో గుడ్ న్యూస్‌.. 2025లో ఏసియానెట్ తెలుగులో ఎక్కువ‌గా చ‌దివిన వార్త‌లివే
School Holidays : జనవరి 1న విద్యాసంస్థలకు సెలవు ఉందా..? మీకు ఈ మెసేజ్ వచ్చిందా..?