కాపు కోటాపై జగన్ వైఖరి మీద నటుడు పృథ్వీ స్పందన ఇదీ

First Published Aug 9, 2018, 10:02 PM IST
Highlights

కాపులకు రిజర్వేషన్లు కల్పించలేనని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై సినీ నటుడు పృథ్వీ స్పందించారు.  గురువారం నాడు వైసీపీ చేపట్టిన వంచనపై గర్జన దీక్ష సభలో ఆయన మాట్లాడారు.

గుంటూరు: కాపులకు రిజర్వేషన్లు కల్పించలేనని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై సినీ నటుడు పృథ్వీ స్పందించారు.  గురువారం నాడు వైసీపీ చేపట్టిన వంచనపై గర్జన దీక్ష సభలో ఆయన మాట్లాడారు.

వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల్లో ఏ విధమైన తప్పూ లేదని, ఆయన చెప్పిందే నిజమని పృథ్వీ అన్నారు. కాపులకు న్యాయం చేస్తానని, వారికి సముచిత స్థానం కల్పిస్తామని జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ 2014లో రైతు రుణమాఫీ చేస్తానని  ఒకే ఒక్కమాట చెప్పేవుంటే ఈ రోజుటికి పదవుల్లో ఉండి నాలుగన్నరేళ్లు పూర్తయ్యేదని అన్నారు. 

తాను ఎక్కడ్నుంచీ పోటీ చేయడం లేదని, తనను అస్సలు సినీ నటుడిగా కాకుండా ఒక జెండా మోసే కార్యకర్తగా మాత్రమే చూడాలని అన్నారు. 2014లో కూడా ప్రతిచోటా తాను తిరిగిన విషయాన్ని గుర్తు చేశారు. 

తాను ఎమ్మెల్యే టికెట్  ఆశించడం లేదని, చివరికి ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్ కూడా తనకు వద్దని, జగన్మోహన్ రెడ్డిని సిఎంగా చూడాలనేదే తన కోరిక అని ఆయన అన్నారు. దివంగత నేత వైఎస్సార్ అంటే తనకు ప్రాణమని, ఈ ఊపిరి ఉన్నంత వరకూ జగనన్నతోటే తన ప్రయాణమని  అన్నారు.
 
ముద్రగడ పద్మనాభం తమకు గురువులాంటి వారని, తాము ఆంధ్ర యూనివర్శిటీలో చదువుకునేటప్పుడు ముద్రగడ ఎన్నో ఉద్యమాలు చేశారని చెప్పారు. ముద్రగడ మడమ తిప్పని వ్యక్తి. రిజర్వేషన్ల గురించి మాట్లాడినప్పుడు ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యులను ప్రభుత్వం హింసించిందని పృథ్వీ అన్నారు. అయినా ముద్రగడ టీడీపీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారో తెలియడం లేదని ఆయన అన్నారు.  వ్యాఖ్యానించారు. 

click me!