మోడీ ఏపీ టూర్ ఖరారు: నవంబర్ 11న విశాఖపట్టణంలో పీఎం పర్యటన

By narsimha lodeFirst Published Oct 26, 2022, 9:27 AM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  వచ్చే నెల  11న విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాల్లో  మోడీ  పాల్గొంటారు.

విశాఖపట్టణం: ప్రధానమంత్రి నరేంద్ర  మోడీ ఈ  ఏడాది నవంబర్  11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఒక్క రోజు ఏపీలోని విశాఖపట్టణంలో మోడీ  పర్యటిస్తారు. రూ.400  కోట్లతో విశాఖపట్టణం రైల్వేస్టేషన్  విస్తరణ  పనులకు ప్రధాని  శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు పలు అభివృద్ది ,సంక్షేమ  కార్యక్రమాల్లో  ప్రధాని పాల్గొంటారు. అనంతరం  ఆంధ్రా యూనివర్శిటీ  గ్రౌండ్స్ లో నిర్వహించే  బహిరంగ  సభలో  మోడీ పాల్గొంటారు.

చాలా రోజుల తర్వాత  ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర పర్యటనకు  వస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో మూడు  రాజధానులకు  అనుకూలంగా  విశాఖపట్టణంలో  జేఏసీ,  వైసీపీ ఆధ్వర్యంలో  కార్యక్రమాలు సాగుతున్నాయి. కానీ   అమరావతినే రాజధానిగా  కొనసాగించాలని  డిమాండ్  చేస్తూ అమరావతి  రైతులు  పాదయాత్ర చేస్తున్నారు. దీపావళిని   పురస్కరించుకొని నాలుగు రోజుల పాటు  ఈ  యాత్రకు  రైతులు విరామం ఇచ్చారు. 

విశాఖపట్టణంలోనే  ప్రధాని  నరేంద్ర  మోడీ  కార్యక్రమం జరగనుండడంతో   మూడు  రాజధానుల అనుకూల , వ్యతిరేక  శిబిరాలు    ఏ  రకమైన  కార్యక్రమాలు నిర్వహిస్తారోననే ఆసక్తి  సర్వత్రా  నెలకొంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వైసీపీ  అధికారంలోకి  వచ్చిన  తర్వాత  మూడు  రాజధానుల  అంశాన్ని  తెరమీదికి  తెచ్చింది

టీడీపీ  అధికారంలో ఉన్న సమయంలో అమరావతిలో  రాజధానికి  అనుకూలమని  చెప్పిన  వైసీపీ ఇప్పుడు  మాట  మార్చడంపై విపక్షాలు  మండిపడుతున్నాయి.   అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని   విపక్షాలు కోరుతున్నాయి. మూడు రాజధానులకు మద్దతుగా  రౌండ్  టేబుల్  సమావేశాలు నిర్వహించింది. ఈ నెల  15న విశాఖపట్టణంలో  నిర్వహించిన  విశాఖ గర్జనకు కూడ వైసీపీ  మద్దతు ప్రకటించింది.  ఈ  కార్యక్రమంలో పాల్గొనేందుకు  వచ్చిన  మంత్రులపై జనసేన శ్రేణులు దాడికి  దిగినట్టుగా   వైసీపీ ఆరోపించింది. అయితే  ఈదాడితో తమకు  సంబంధం లేదని  జనసేన  స్పష్టం  చేసింది.

click me!