సెల్ఫీ తీసుకుంటూ.. నదిలో పడి యువకుడి గల్లంతు...

Published : Oct 26, 2022, 09:03 AM IST
సెల్ఫీ తీసుకుంటూ.. నదిలో పడి యువకుడి గల్లంతు...

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లో విషాదఘటన చోటు చేసుకుంది. నది బ్యారేజ్ మీదున్న రెయిలింగ్ మీద నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న ఓ యువకుడు గల్లంతయ్యాడు. 

ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఓ యువకుడు గల్లంతయ్యాడు. బ్యారేజ్ రైలింగ్ పై ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు యువకుడు నదిలో పడిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. గల్లంతైన యువకుడు దుర్గాప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. యువకుడి కోసం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

అక్టోబర్ 16న ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. సెల్ఫీ మోజులో పడి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటన రోజు సాయంత్రం వైతర్ణ సేతుపై సెల్ఫీ  కోసం వెళ్లిన నలుగురు మహిళలకు పెను ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు మహిళలు కలిసి సెల్ఫీలు దిగుతుండగా కాలుజారి నీటిలో పడిపోయారు. వీరిలో ఇద్దరు నీటిలో మునిగి చనిపోగా, ఇద్దరిని రక్షించారు.

శ్రీకాళహస్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్‌లో కొట్లాట, మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలోనే

మరణించిన మహిళలను నీలా దంసింగ్ దాస్నా (24), సంతు దాస్నా (15)గా గుర్తించినట్లు పోలీసు అధికారి తెలిపారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సెల్ఫీ దిగుతుండగా బ్యాలెన్స్ తప్పి ప్రవాహం బలంగా ఉండడంతో అందులోకి వెళ్లిపోయామని వారు చెప్పారు. గుంపులోని ఇద్దరు వ్యక్తులను అక్కడ ఉన్న వ్యక్తులు రక్షించారు, నీల, సంత  అనే మహిళలు నీటిలో మునిగిపోయారు. రెండు మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : చలి తగ్గడం మూన్నాళ్ల ముచ్చటే... మళ్లీ గజగజలాడించే చలి, పొగమంచు ఎక్స్ట్రా
AP Food Commission Warning at NTR District | “మీ ఉద్యోగం పోతుంది చూసుకోండి” | Asianet News Telugu