
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తన ప్రసంగంలో కేంద్రంలోని బీజేపీ పై విమర్శలు చేయకుండా ప్రధానితో మెలిగిన తీరు వల్ల రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేనల పొత్తును అడ్డుకోవడంతో పాటు, విశాఖపట్నాన్ని వ్యూహాత్మక రాజధానిగా ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారని నిపుణులు చెబుతున్నారు.
ఈ కార్యక్రమంలో జగన్ మోహన్ రెడ్డి, మోడీల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రతిపక్షాలు విమర్శించినప్పటికీ.. కేంద్రంతో సంబంధాలు పార్టీ శ్రేణులకు అతీతమైనవని, 2024 ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తప్ప మరే ఇతర ఎజెండా తమకు లేదని ముఖ్యమంత్రి అన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వంతో తమ బంధం పార్టీలకు, రాజకీయాలకు అతీతం, మన రాష్ట్ర ప్రయోజనాలు తప్ప, మాకు వేరే అజెండా ఎప్పటికీ ఉండదు. విభజన గాయాల నుంచి ఎనిమిదేళ్లు గడిచినా ఏపీ ఇంకా కోలుకోలేదు’ అని ఆయన తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు.
దారుణం.. బాలిక మీద ఐదుగురు వ్యక్తుల అత్యాచారం, వీడియో సోషల్ మీడియాలో పెట్టి... ముగ్గురు అరెస్ట్..
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రతిపక్షాలు రెచ్చగొట్టడంపై స్పందించిన జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య, రైల్వే జోన్ ఏర్పాటు విషయాలను పలు సందర్భాల్లో ప్రధానితో మాట్లాడానని ఈ సందర్భంగా చెప్పారు. అయితే మూడు రాజధానుల ప్రణాళికకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రాజకీయ పార్టీల ఆశలను నీరుగార్చేందుకే.. జగన్ మోహన్ రెడ్డి పై, విశాఖపై విపరీతమైన ప్రశంసల జల్లు కురిపిస్తూ మోడీ చేసిన వ్యాఖ్యలు తెలివైన పన్నాగమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ పర్యటన సందర్భంగా మోడీ మాట్లాడుతూ ‘‘ విశాఖ యావత్ దేశానికి ఎంతో ప్రత్యేకమైన నగరం. పురాతన భారతదేశంలో విశాఖపట్నం ఓ ప్రముఖ ఓడరేవు నగరం, ఇది దేశంలోని అత్యంత ముఖ్యమైన వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా ఉంది. తీర రేఖ ఉన్న చోట అభివృద్ధి జరుగుతుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు.
బాబోయ్.. పిల్లిని వేటాడుతూ ఇంట్లోకి దూసుకొచ్చిన చిరుత.. అది చూసిన ఆ కుటుంబం ఏం చేసిందంటే...
పరిపాలనా వికేంద్రీకరణ విషయంలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఓడరేవు నగరాన్ని అభివృద్ధి చేయడానికి తగిన సాయం కోరినప్పుడు మోడీ చిరునవ్వు నవ్వారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అయితే సుప్రీంకోర్టు ఈ విషయంలో క్లియరెన్స్ ఇచ్చేంత వరకు మోడీ మూడు రాజధానుల ప్రణాళికకు కట్టుబడి ఉండే అవకాశం లేదని వారు పేర్కొంటున్నారు.
అలాగే బీజేపీ - టీడీపీ-జేఎస్ కూటమి ఏర్పాటుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలను మోడీ అడ్డుకున్నారని.. ఇది జగన్ పాలన కొనసాగే అవకాశాలను పెంచిందని సీనియర్ రాజకీయ నిపుణులు అంటున్నారు. కాగా.. ఓ వైపు నెరవేర్చని హామీలను లేవనెత్తడం ద్వారా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుండగా.. మరో వైపు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడానికి, రాష్ట్ర సమస్యలను పరిష్కరించేలా ప్రజలను ఒప్పించడానికి జగన్ మోహన్ రెడ్డి మోడీ పర్యటనను ఉపయోగించుకున్నారని నిపుణులు చెబుతున్నారు.