ప్రధాని మోడీ ఏపీ పర్యటన.. ఎందుకంటే...

By SumaBala BukkaFirst Published Jan 16, 2024, 7:27 AM IST
Highlights

రాష్ట్రానికి రానున్న ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్వాగతం పలకనున్నారు. ప్రధాని పాలసముద్రంలో కొత్తగా నిర్మించిన నాసిక్ సంస్థను ప్రారంభిస్తారు.  

సత్య సాయి జిల్లా : మంగళవారం నాడు  ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లాలోని పాలసముద్రంలో పర్యటిస్తారు. అక్కడ రూ. 541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదకద్రవ్యాల అకాడమీ ఏర్పాటు  చేయనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 503 ఎకరాల విస్తీర్ణంలో శిక్షణ కేంద్రాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత లేపాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. రాష్ట్రానికి రానున్న ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్వాగతం పలకనున్నారు. 

ప్రధాని పాలసముద్రంలో కొత్తగా నిర్మించిన నాసిక్ సంస్థను ప్రారంభిస్తారు.  ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం రెండుంపావుకు గోరంట్లకు చేరుకుంటారు. అక్కడ గవర్నర్ నజీర్ తో కలిసి ప్రధానికి స్వాగతం పలుకుతారు. ప్రధాని పర్యటన ముగిసి, ఆయన వెళ్లిపోయిన తరువాత సాయంత్రం ఏడున్నరకు తిరిగి తాడేపల్లికి ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారు. 

Latest Videos

పాలసముద్రంలో రెవెన్యూ సర్వీసెస్ కు ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఐఏఎస్ లకు ముసోరి, ఐపీఎస్ లకు హైదరాబాద్ తరహాలో ఉంటుంది. ఈ ఆవరణలోనే సోలార్ సిస్టం కూడా సిద్ధం చేశారు. 

ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక విమానాలు మధ్యాహ్నం 12:30 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రమానికి చేరుకుంటారు. అక్కడినుంచి మధ్యాహ్నం 1.20 గంటలకు హెలికాప్టర్లో లేపాక్షి దగ్గర దిగుతారు. ఆ తరువాత  ఒంటిగంటన్నరకు వీరభద్ర స్వామి ఆలయానికి చేరుకుని రెండున్నర గంటల వరకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత పావు తక్కువ మూడు గంటలకు లేపాక్షి హెలిపాడ్ నుంచి పాలసముద్రంకు బయలుదేరుతారు.  అక్కడి నాసిక్ కేంద్రానికి చేరుకుని సాయంత్రం ఐదు గంటల వరకు పర్యటిస్తారు.

నాసిక్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఐదు గంటలకు ముగుస్తుంది.ఐదుంపావుకు నాసిక్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి పుట్టపర్తికి చేరుకుంటారు. పుట్టపర్తి నుంచి సాయంత్రం గం.5.40కి ప్రత్యేక విమానంలో బయలుదేరి కేరళ వెళ్ళిపోతారు. సాయంత్రం 6:45 నిమిషాలకు కేరళలోని కొచ్చికి చేరుకుంటారు. ప్రధాని,  గవర్నర్, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాచనీయ ఘటనలో జరగకుండా పుట్టపర్తి విమానాశ్రయంలో  కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 
 

click me!