పవన్ జనసేన అధ్యక్షుడే అయినా... పార్టీని నడిపించేది ఆయనే..: కాపు కార్పోరేషన్ ఛైర్మన్ సంచలనం

Published : Jul 12, 2022, 04:30 PM IST
పవన్ జనసేన అధ్యక్షుడే అయినా... పార్టీని నడిపించేది ఆయనే..: కాపు కార్పోరేషన్ ఛైర్మన్ సంచలనం

సారాంశం

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఆంధ్ర ప్రదేశ్ కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన పార్టీకి పవన్ అధ్యక్షుడే అయినా అనఫిషియల్ అధ్యక్షుడు మరొకరు వున్నారని అన్నారు. 

విజయవాడ : రాజకీయాల కోసం తాను కాపును అని చెప్పుకోలేని వ్యక్తి కూడా చివరకు కాపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందంటై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (pawan kalyan) పై కాపు కార్పొరేషన్ (kapu corporation) చైర్మన్ అడపా శేషు (adapa seshu) మండిపడ్డారు.  పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడు ఏమాత్రం కాదు... ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని ఎద్దేవా చేసారు. జనసేన పార్టీ (janasena party) అధ్యక్షుడు పవనే అయినా... దాన్ని నడిపించేది మాత్రం నాదెండ్ల మనోహర్ (nadendla manohar) అంటూ శేషు సంచలన వ్యాఖ్యలు చేసారు. 

విజయవాడలో అనేక పార్టీ కార్యాక్రమాలు చేస్తున్న పవన్ కల్యాణ్ కు పక్కనే వున్న కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా విగ్రహానికి కనీసం ఒక్కసారయినా పూల మాల వేసాడా? అని శేషు ప్రశ్నించారు. అలాంటిది ఆయన గురించి మాట్లాడే హక్కు పవన్ కు ఎక్కడదని నిలదీసారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో వుండగా కాపులు అనేక ఇబ్బందుకుల గురయ్యారని... ఆ సమయంలో పవన్ ఎమయ్యాడు? అని అడపా శేషు నిలదీసారు. 

పవన్ కల్యాణ్, జనసేన పార్టీ కాపుల పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఆయన కులాలు, మతాల పేరిట చేసే రాజకీయాలను కాపు సామాజికవర్గ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కాపు కార్పొరేషన్ ని సీఎం జగన్ సక్రమంగా నడిపిస్తున్నారని... వారికి ఏం కావాలో అవే చేస్తున్నారని శేషు పేర్కొన్నారు. 

read more  పవన్ కళ్యాణ్‌ది వీకెండ్ ప్రజాసేవ.. రాజకీయాలకు కూడా ఆలస్యమే: పేర్ని నాని సెటైర్లు

వెనుకబడిన అగ్రకుల విద్యార్థులకు విదేశీ విద్య దీవెనతో సీఎం జగన్ వరం ఇచ్చారన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా చాలిచాలకుండా కాకుండా ఎక్కువ మందికి విదేశీ విద్య అందేలా జగన్ చర్యలు తీసుకున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా 200 యూనివర్సిటీ ల్లో ఈ పథకం ద్వారా చదువుకోవచ్చని అన్నారు. గత ప్రభుత్వం విదేశీ విద్య పథకానికి రూ.6 లక్షల వార్షిక ఆదాయం నిబంధన పెడితే ప్రస్తుతం రూ.8 లక్షల వరకూ అవకాశం ఇచ్చారని అడపా శేషు తెలిపారు. 

ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు, పవన్ ల వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు. అందుకే వైసిపి ప్రభుత్వ పథకాలపై టీడీపీ, జనసేన పార్టీలు అసత్యప్రచరం చేస్తున్నాయన్నారు. చంద్రబాబు హయాంలో కాపు కార్పొరేషన్ ను పట్టించుకోకపోగా దీని పేరుతో ఇష్టం వచ్చినట్టు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. డబ్బులున్న వారి పిల్లలు కూడా ఈ కార్పొరేషన్ ద్వారా విదేశాలకు వెళ్ళారని...మరికొందరయితే విదేశాలు వెళ్లకుండా డబ్బులు కాజేసారని కాపు కార్పోరేషన్ ఛైర్మన్ శేషు ఆరోపించారు. 

టిడిపి నేత బుద్దా వెంకన్నపై కూడా శేషు విరుచుకుపడ్డారు.  ఆయన బ్రతుకేంటో విజయవాడ ప్రజలందరికీ తెలుసన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏపీ షిండే అంటూ పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్న వెంకన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక కొస్తేస్తాం అని అడపా శేషు హెచ్చరించారు. 
 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!