కోవిందుడు ఇక అందరివాడే

First Published Jul 25, 2017, 2:02 PM IST
Highlights
  • 14 వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం 
  • పార్లమెంట్ సెంట్రల్ హాల్   అట్టహాసంగా జరిగిన కార్యక్రమం
  • రాష్ట్రపతి హోదాలో మొదటిసారి రాష్ట్రపతి భవన్ లో ప్రవేశం  

 
భారతదేశ 14 వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ మంగళ వారం ప్రమాణ స్వీకారం చేయించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమంలో వేదికపై రామ్ నాథ్ కోవింద్ తో పాటు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, స్పీకర్ సుమిత్రా మహజన్ ,ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలు ఆసీనులయ్యారు.
అలాగే ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రతిబా పాటిల్, మాజీ ప్రదానులు దేవె గౌడ,మన్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్రమోదీ, ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధి, బీజేపి సీనియర్ నేతలు అద్వానీ,మురళీ మనోహర్ జోషి లతో పాటు కేంద్ర మంత్రులు ,ప్రతిపక్ష నాయకులు, వివిధ రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి ప్రసంగించారు. సాధారణ కుంటుంబంలో పుట్టిన తనలాంటి వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నికవడం ప్రజాస్వామ్య గొప్పతనమని అన్నారు. మాజీ రాష్ట్రపతులైన సర్వేపల్లి రాధాకృష్ణ , ఏపీజే అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ లు చూపిన బాటలో నడుస్తానన్నారు. 21 శతాబ్దంలో భారత్ అభివృద్ది వేగంగా జరుగుతుందని, ఆర్థికంగా, సామాజికంగా చాలా మార్పులు వచ్చాయని గుర్తుచేసారు. 
భారత్ భిన్నత్వంలో ఏకత్వం అన్న నినాదంతో భారతదేశం ముందుకు పోవాలని తాను ఆకాక్షిస్తున్నట్లు తెలిపారు. సర్వ ధర్మ పరిపాలనకు తాను కట్టుబడి ఉంటానని అన్నారు. దేశం వసుదైక కుటుంబ భావనతో ముందుకు పయనించాలన్నారు.
శాస్త్రవేత్తల కృషి ఫలితంగా మనం మంగళయాన్ వంటి అద్బుత ప్రమోగాలు సాధించగలిగామన్నారు.వారి సేవలను ధేశం గుర్తుంచుకుంటుందన్నారు.అలాగే రైతులు ముఖ్యంగా మహిళా రైతులు దేశం ఆకలి భాధను తీర్చడానికి పడుతున్న శ్రమ అనిర్వచనీయమన్నారు.
పోలీసులు, త్రివిధ దళాలు  దేశ రక్షణకు ఎనలేని సేవలు చేస్తున్నారని, వారి త్యాగాలను ఎన్నటికీ మర్చిపోలేమని అన్నారు. 
మహాత్మాగాందీ, దీన్ దయాళ్ ఉపాద్యాయ లాంటి మహనీయుల త్యాగాలకు ఫలితగానే భారత్ స్వాతంత్ర్య కాంక్షను నెరవేర్చకుందని అన్నారు. ప్రభుత్వం నల్ల ధనాన్ని నివారించడానికి కరెన్సీ రద్దు, జీఎస్టీ వంటి సంస్కరణలు ప్రవేశ పెట్టి  ఈ  స్వాతంత్ర్య ఫలితాలను ముందుకు తీసుకువెడులోందని గుర్తు చేసారు. విదేశీ వ్యవహారాలు,ప్రవాసుల రక్షణను బలోపేతం చేయడానికి ప్రభుత్వ కృషి మర్చిపోలేనిదని అన్నారు.
ప్రపంచం మొత్తం ఇపుడు భారత్ వైపు చూస్తోందని, అతిపెద్ద మార్కెట్ కల్గిన మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదేనని తెలిపారు. శాంతి స్థాపనకు, పర్యావరణ పరిరక్షనకు దేశ ప్రజలు కట్టుబడి ఉండాలని అన్నారు.  


తాను ఈ పార్లమెంట్ హాల్ లోకి మొదట సాధారణ ఎంపీగా అడుగుపెట్టానని,ఇపుడు ఇలా రాష్ట్రపతిగా ఎన్నికవడం గర్వంగా ఉందన్నారు. తన సహచరుల పట్ల గౌరవంగా మెలిగానని, వారు తనతో ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు.
తర్వాత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి ధన్యవాద ప్రసంగంలో మాట్లాడుతూ రామ్ నాథ్ ప్రసంగించిన విషయాలను గుర్తుచేసారు.      
కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి కోవింద్ ప్రధాని నరేంద్ర మోదీ, అద్వానీ, మురళీ మనోహర్ జోషిలతో కరచాలనం చేస్తూ ఆత్మీయంగా మాట్లాడారు. అనంతరం ప్రణబ్ ముఖర్జీ స్వయంగా రాష్ట్రపతి భవనానికి తీసుకువెళ్లారు. ఇలా మొదటిసారిగా రాష్ట్రపతి హోదాలో ఆయన రాష్ట్రపతి భవనంలో అడుగుపెట్టారు.
 

click me!