ఉద్యోగ సంఘాల్లో చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం కుట్ర:పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు

By narsimha lode  |  First Published Jan 28, 2022, 5:21 PM IST

గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల ఆందోళనలో పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.  ప్రభుత్వంపై బొప్పరాజు సీరియస్ వ్యాఖ్యలు చేశారు. 


అమరావతి:PRC నివేదిక‌ను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందని పీఆర్సీ సాధన సమితి నేత Bopparaju Venkateswarlu ప్ర‌శ్నించారు.గుంటూరు జిల్లా క‌లెక్ట‌రేట్ వ‌ద్ద Employees  సంఘాలు శుక్రవారం నాడు రిలే దీక్ష‌లు నిర్వహించారు.ఈ దీక్షల్లో  బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

 రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు  పీఆర్సీ కోసం పోరాడుతున్నార‌న్నారు.  ఫిబ్ర‌వ‌రి 3న చేప‌ట్ట‌నున్న ఛ‌లో Vijayawada కార్య‌క్ర‌మాన్ని దద్ద‌రిల్లేలా చేయాల‌ని ఆయ‌న ఉద్యోగ సంఘాలను కోరారు.. ఉద్యోగుల ఆందోళ‌న‌ల‌ను ప్ర‌భుత్వం పట్టించుకోవ‌ట్లేద‌ని తెలిపారు.ఉద్యోగ సంఘాలతో ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు స్థంభాలాట ఆడిందని ఆయన  మండిపడ్డారు  ఇది చాలదన్నట్టు ఉద్యోగుల్లో చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. పీఆర్సీ Struggle committee నేతలు కూడా లేఖ ఇచ్చి చర్చలు జరిపాలని కోరామన్నారు. 

Latest Videos

ప్రభుత్వం తరపున ఎవరు వస్తారోననేది వారిష్టమన్నారు.అలాగే మా తరపున ఎవర్ని చర్చలకు పంపాలనేది మా ఇష్టమన్నారు. తాము  ఇచ్చిన లేఖకు సమాధానం చెప్పకుండా మళ్లీ చర్చలకు రమ్మంటే ఎలా..? అని ఆయన ప్రశ్నించారు.తాము చర్చలకు వెళ్లినా రావడం లేదని ప్రభుత్వం విమర్శిస్తోందన్నారు..చర్చలకు వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలూ ఈ పీఆర్సీ వద్దనే చెబుతారన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం   YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ పై ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందించలేదు. దీంతో సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి.  ఈ నెల 24న రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె  నోటీసును అందించాయి. అంతేకాదు ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ఇప్పటికే నాలుగు దఫాలు ఉద్యోగులను చర్చలకు పిలిచింది. అయితే ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను నెరవేరిస్తేనే చర్చలకు హాజరౌతామని చెప్పారు.

ఫిబ్రవరి 7వ తేదీ వరకు పలు రకాల ఆందోళనలను ఉద్యోగ సంఘాలు నిర్వహించనున్నాయి. తమ ఆందోళనల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు. అప్పటికి కూడా ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే సమ్మెలోకి వెళ్లనున్నారు. ప్రభుత్వం మాత్రం చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరుతుంది. చర్చలకు రావడానికి ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వానికి షరతులు విధించాయి.

తాము చర్చలకు వెళ్లినప్పుడు మిగిలిన వాళ్లు చర్చలకు వెళ్తే తప్పేంటీ..? వెళ్లనీయండి. ఉద్యోగుల్లో చీలిక తేవాలన్న ప్రభుత్వ ప్రయత్నం విఫలం కాక తప్పదన్నారు. మేమంతా ఒకటే అని బొప్పరాజు స్పష్టం చేశారు
 

click me!