పీఆర్సీ వివాదం.. ఈ రోజు ముగింపు పలికే అవకాశం, మంత్రుల కమిటీతో మరోసారి ఉద్యోగ నేతల భేటీ

Siva Kodati |  
Published : Feb 05, 2022, 04:32 PM IST
పీఆర్సీ వివాదం.. ఈ రోజు ముగింపు పలికే అవకాశం, మంత్రుల కమిటీతో మరోసారి ఉద్యోగ నేతల భేటీ

సారాంశం

పీఆర్సీపై (prc) చర్చించేందుకు మంత్రుల కమిటీతో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ (prc steering committee) సమావేశమైంది. ఏపీ సచివాలయంలోని బ్లాక్ నెంబర్ 2లో ఆర్ధిక శాఖ మీటింగ్ హాల్‌లో  సమావేశం జరుగుతోంది.

పీఆర్సీపై (prc) చర్చించేందుకు మంత్రుల కమిటీతో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ (prc steering committee) సమావేశమైంది. ఏపీ సచివాలయంలోని బ్లాక్ నెంబర్ 2లో ఆర్ధిక శాఖ మీటింగ్ హాల్‌లో  సమావేశం జరుగుతోంది. హెచ్ఆర్ఏ (hra) అలాగే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ శ్లాబ్‌లు, సీసీఏ రద్దు (cca) , మట్టి ఖర్చులు వంటి అంశాల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ మీటింగ్ తర్వాత పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు  సీఎం జగన్‌తో సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అంతకుముందు మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) మాట్లాడుతూ.. అర్ధరాత్రి వరకూ ఉద్యోగ సంఘాలతో చర్చించామని, అసంతృప్తులు, అపోహలు తొలగించేలా చర్చలు జరిగాయన్నారు. ఆర్ధిక పరమైన అంశలు మేము చర్చించుకుని.. మధ్యాహ్నం ఉద్యోగులతో చర్చిస్తాం అని ఆయన చెప్పారు. పాజిటివ్ వాతావరణం లో చర్చలు జరుగుతున్నాయి. పిట్ మెంట్ అంశం అయిపోయింది. అందులో మార్పు ఉండదు. HRA, రికవరీ అంశాలపైనే ఇంకా చర్చించాల్సి ఉందన్నారు. మిగిలినవన్నీ చిన్న చిన్నవే అని తెలిపారు. వీటిలో కొన్ని అంశాలు సీఎం దృష్టికి  తీసుకు వెళతామన్నారు. రికవరి లేకపోతే ఆర్ధిక భారం 5 నుంచి 6వేల కోట్లు ఆర్ధిక భారం అవుతుందన్నారు. 

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌తో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్న మంత్రుల కమిటీ శనివారం భేటీ అయింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పీఆర్సీ సాధన సమితి నాయకులతో జరిగిన చర్చల సారాంశాన్ని మంత్రుల కమిటీ సీఎం జగన్‌ను వివరించనుంది. ఈ భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ‌లతో పాటుగా ఆర్థిక శాఖ అధికారులు పాల్గొననున్నారు.  

ఇక, శనివారం ఉదయం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. సీఎం జగన్ ముందు నుంచి ఉద్యోగులకు మేలు చేయాలనే చెబుతున్నారని తెలిపారు. అందుకే మంత్రులతో కమిటీ వేశారని చెప్పారు. నిన్న రాత్రి ఉద్యోగులతో చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. ఉద్యోగులకు నష్టం జరిగేలా ప్రభుత్వం వ్యవహరించదని చెప్పారు. హెఆర్‌ఏ సహా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. 

ఈరోజు జరిగే చర్చలు ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉంటాయని భావిస్తున్నట్టుగా మంత్రి పేర్ని నాని (perni nani) చెప్పారు. చర్చల తర్వాత ఉద్యోగ సంఘాలు ఉద్యమాన్ని విరమించుకుంటారని ఆశిస్తున్నట్టుగా తెలిపారు. నిన్నటి చర్చల్లో అనేక అంశాలపై ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయని అన్నారు. ఆర్థికపరమైన అంశాలపై ప్రభుత్వంలో అంతర్గతంగా చర్చించుకుని.. మధ్యాహ్నం ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అవుతామని వెల్లడించారు. షరతులతో చర్చలు జరగవని.. సమస్య పరిష్కారం కాదని అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Roop Kumar Yadav Serious Comments Anil Kumar Yadav | Nellore Political Heat | Asianet News Telugu
Manyam Collector Presentation on Mustabu Programme | Chandrababu | Collectors | Asianet News Telugu