
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (andhra pradesh govt) పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు సంస్థలు ఏపీని మందలించాయి కూడా. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వ అప్పులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే భారీగా అప్పులు (ap loans) చేసిన ప్రభుత్వం మరో రూ. 2 వేల కోట్ల అప్పుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వచ్చే మంగళవారం ఆర్బీఐ నిర్వహించే సెక్యూరిటీల వేలంలో ఏపీ ప్రభుత్వం పాల్గొనబోతోంది. అప్పు పొందేందుకు ప్రతిపాదనలను సమర్పించనుంది. 16 ఏళ్ల కాలపరిమితికి వెయ్యి కోట్లు, 20 ఏళ్ల కాలపరిమితికి మరో వెయ్యి కోట్లు రుణం పొందేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే ఎంత శాతం వడ్డీ రేటుకు రుణం లభిస్తుంది అనే విషయం వేలంలో తేలనుంది.