ఉక్కు కోసం ఉడుకుతున్న కడప జిల్లా

First Published Jan 20, 2017, 7:29 AM IST
Highlights

ప్రవీణ్ కు మద్దతు గా ర్యాలీలు, వంట-వార్పులు

 ‘కడప ఉక్కు-సీమ హ‌క్కు’ అనే నినాదంతో ప్రొద్దుటూరులో స్టీల్ ప్లాంట్ సాధన సమితి కర్మాగారం సాధన సమితి అధ్యక్షుడు జి. ప్రవీణ్ కుమార్ రెడ్డి అమరణ నిరాహార దీక్ష నేడు మూడో రోజుకు చేరుకుంది. ఆయన మనకు మద్దతుల జిల్లాలో అనేక చోట్ల ర్యాలీలు తీశారు.

 

మైదుకూరులో శుక్రవారం ఆంద్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ర్యాలీ నిర్వహిస్తోంది.. కడపరోడ్డులోని మండల రెవిన్యూ కార్యాయలం నుండి ఉద‌యం 10.30గంట‌ల నుండి  ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టారు.. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఆవశ్యకత తెలియ చేస్తూ ప్రవీణ్ ఆమరణ నిరాహారదీక్షకు సంఘీభావం ప్ర‌క‌టించాల్సిన కోరుతూ జ‌ర్న‌లిస్టులు ర్యాలీ చేప‌డుతున్నారు.

 

ఈ ర్యాలీలో ప్ర‌జాస్వామ్య వాదులు, ప్ర‌జా, కార్మిక‌, రైతు సంఘాలు, మేధావులు, విద్యార్ధినీ విద్యార్ధులు, వివిధ సంఘాల ప్ర‌తినిధులు  పాల్గొన్నారు. ఈ రోజు డాక్టర్లు ఆయన ఆరోగ్యాన్నిపరిశీలించారు. ప్రొద్దుటూరులో రోడ్ల మీద వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజలు తండోపతండాలు వచ్చి ప్రవీణ్ కు మద్దతు తెలుపుతున్నారు.

 

కడప జిల్లా స్టీల్ ప్లాంట్ ను రాజకీయ పార్టీలువిస్మరించినపుడు కొంతమంది యువకులను, విద్యావంతులను,మేధావులను కూడ దీసి ప్రవీణ్ కుమార్ రెడ్డి కడపఉక్కు-సీమ హక్కు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఒకటిన్నర సంవత్సరాంగా ఆయన ఈ ఉద్యమాన్ని  ఇంటింటికి, కాలేజీలకు స్కూళ్లకు తీసుకెళ్లడంలోవిజయవంతమయ్యారు. దీనితో పార్టీలుగా కాకపోయిన,  రాజకీయ నాయకులంతా వ్యక్తులుగా ప్రవీణ్ కు సంఘీభావం చెప్పకుండా ఉండలేని పరిస్థితి జిల్లాలో ఏర్పాటయింది.

 

ప్రభుత్వం స్పష్టమయిన కార్యాచరణ ప్రణాళికప్రకటించే వరకు ఉద్యమం సాగిస్తామని ప్రవీణ్ చెబుతున్నాడు.

 

 

click me!