
వ్యవస్ధల మధ్య పోరులో జల్లికట్టే గెలిచింది. జల్లికట్టు నిర్వహణ విషయంలో ఏమి చేయాలో అర్ధంకాక న్యాయ, అధికార వ్యవస్ధలు చేతులెత్తాసాయి. తమిళనాడు సంపద్రదాయ క్రీడ జల్లికట్టును హైకోర్టు నిషేధించటాన్ని వ్యతిరేకిస్తూ యావత్ తమిళనాడు ఏకమైపోయింది. దాంతో ఐదు రోజులుగా మొత్తం తమిళనాడే ఉడికిపోతోంది.
వారు వీరు అనిలేకుండా రాజకీయపార్టీలు, సినీరంగం, విద్య, వ్యాపార, వాణిజ్యరంగాలతోత పాటు మేధావులు అందరూ జల్లికట్టుకు మద్దతు పలకారు. నిషేధం ఎత్తేస్తూ, జల్లికట్టుకు అనుకూలంగా కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయాలంటూ లక్షలాది మంది చెన్నైలోని మెరీనాబీచ్ లో నాలుగు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదే విషయాన్ని సిఎం ఢిల్లీకి వెళ్లి మరీ నరేంద్రమోడికి వివరించారు. దాంతో మధ్యేమార్గం ఆలోచించారు. న్యాయవ్యవ్యవస్ధ, కేంద్రప్రభుత్వాలకు సంబంధాలు లేకుండా తమిళనాడు ప్రభుత్వమే జల్లికట్టు నిర్వహణకు అనుకూలంగా ఆర్డినెన్స్ జారీ చేసింది. కేంద్రప్రభుత్వ సొలిసిటర్ జనరల్ ముకుల్ రోహిత్గి ఇచ్చిన సలహా మేరకు సంప్రదాయ క్రీడల నిర్వహణకు ఆయా రాష్ట్రప్రభుత్వాలే ఆర్డినెన్స్ జారీ చేయవచ్చట. ఇంకేముంది, ఆ సలహా మేరకు తమిళనాడు ప్రభుత్వమే ఆర్డినెన్స్ జారీచేసేసింది.
అయితే, ఆమోదం కోసం సదరు ఆర్డెనెన్స్ ను కేంద్ర హోంశాఖకు పంపింది. సరే, దానికి హోంశాఖ ఆమోదం లాంఛనమే అనుకోండి. దానికితోడు సుప్రింకోర్టు కూడా ‘జల్లికట్టు నిర్వహణ విషయమై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలే చర్చించుకుని ఓ నిర్ణయానికి రండి’ అని సూచించటం గమనార్హం. అంటే అర్ధమేమిటి? తమిళనాడు దెబ్బకు అటు కేంద్రప్రభుత్వం, ఇటు న్యాయవ్యవస్ధ దిగొచ్చాయి. ఎవరికీ ఇబ్బందులు లేకుండా, అందరి పరువు నిలిచేవిధంగా రాష్ట్రప్రభుత్వం ద్వారానే జల్లికట్టుకు ఆర్డినెన్సును జారీ చేయించారన్నమాట. అది...తమిళనాడు దెబ్బంటే.