చంద్రబాబు లంచాలిచ్చారా ?

Published : Dec 13, 2016, 05:29 AM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
చంద్రబాబు లంచాలిచ్చారా ?

సారాంశం

నేషనల్ మీడియాలో తన గురించి గొప్పగా ప్రచారం చేయించుకోవటం కోసం ఓ 25 మంది జర్నలిస్టులను నియమించుకున్నారు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు జర్నలిస్టులకు లంచాలిస్తున్నారా? నిజమేనా?  ఆంత పెద్ద ఆరోపణ చేయటానికి ఎంత ధైర్యం  కావాలి. నిప్పు చంద్రబాబు ఏమిటి? లంచాలివ్వటమేమిటి? ఎంతమాట...ఎంత మాట.

 

ఇంతకీ చంద్రబాబుపై ఆరోపణలు చేసింది ఎవరంటే, సుప్రింకోర్టు న్యాయవాది, సామాజిక ఉద్యమకారుడు ప్రశాంత్ భూషణ్.  ఈ మధ్యే చంద్రబాబు ప్రభుత్వం 25 మంది జర్నలిస్టులను కాంట్రాక్ట్ పద్దతిలో ముఖ్యమంత్రి కార్యాలయంలో నియమించుకున్నది. ఎందుకు నియమించుకుందంటే, చంద్రబాబుకు ఇపుడు ప్రచారం తక్కువైపోయిందని.

 

భవిష్యత్తులో జాతీయ స్ధాయిలో చక్రం తిప్పుదామని అనుకుంటున్నట్లున్నారు చంద్రబాబు. అందుకు వీలుగా నేషనల్ మీడియాలో తన గురించి గొప్పగా ప్రచారం చేయించుకోవటం కోసం ఓ 25 మంది జర్నలిస్టులను నియమించుకున్నారు లేండి. అది కూడా ఒక్కోరికి నెలకు రూ. 51,468ల జీతంపైన.

 

నియమించుకున్న వారిని ఏ ప్రాతిపదికన తీసుకున్నారన్న విషయాన్ని ఎవరూ అడగ్గూడదు. ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయమ్మీదే ప్రశాంత్ భూషణ్ చంద్రబాబుపై ఆరోపణలు చేసారు.

 

చంద్రబాబు తన సొంత డబ్బా  వాయించుకునేందుకు జర్నలిస్టులను నియమించుకున్నట్లు మండిపడ్డారు. చంద్రబాబు జర్నలిస్టులకు అధికారికంగానే లంచాలిస్తున్నారు చూడండంటూ ట్వీట్ చేసారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?