నన్ను కలవకుండా విజయసాయిరెడ్డిని కలుస్తారా: స్టీల్ ప్లాంట్ కార్మికులపై పాల్ ఆగ్రహం

Siva Kodati |  
Published : Mar 21, 2021, 05:49 PM IST
నన్ను కలవకుండా విజయసాయిరెడ్డిని కలుస్తారా: స్టీల్ ప్లాంట్ కార్మికులపై పాల్ ఆగ్రహం

సారాంశం

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తున్న సంగతి తెలిసిందే. 

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తున్న సంగతి తెలిసిందే.

కార్మికుల నిరసనకు రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజాసంఘాలు మద్ధతు తెలుపుతున్నాయి. అయితే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ ప్రబోధకుడు కేఏ పాల్ ఏకంగా హైకోర్టులోనే పిటిషన్ వేశారు.

ఈ నేపథ్యంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన పాల్.. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు అండగా నిలిచేందుకు తాను అమెరికా నుంచి ఢిల్లీ వచ్చానని చెప్పారు. కానీ ఢిల్లీ వచ్చిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేతలు తనను కలవకుండా, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తాను హైకోర్టులో మూడు వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి కార్మిక నేతలకు తెలియదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంఘం నేతలు గనుక తనను కలిసి చర్చిస్తే బావుండేదని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

తాను వారి తరఫున ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని కేఏ పాల్ ప్రకటించారు. కార్మికుల కోసం తాను అమెరికా నుంచి వస్తే వారు తనను కలవకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. వారి కోసం ఎలాంటి పోరాటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని పాల్ స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu