ఏపీలో కొత్తగా 2,345 మందికి పాజిటివ్.. 19,31,555కి చేరిన మొత్తం కేసులు

Siva Kodati |  
Published : Jul 16, 2021, 05:50 PM ISTUpdated : Jul 16, 2021, 05:55 PM IST
ఏపీలో కొత్తగా 2,345 మందికి పాజిటివ్.. 19,31,555కి చేరిన మొత్తం కేసులు

సారాంశం

ఏపీలో కొత్తగా 2,345 కరోనా కేసులు నమోదవ్వగా.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 3,001 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 24,854 మంది చికిత్స పొందుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2,345 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,31,555కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,097కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి తూర్పుగోదావరి 2, చిత్తూరు 2, ప్రకాశం 2, అనంతపురం 2 , కృష్ణ 2, కర్నూలు 2,  గుంటూరు 3, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 3,001 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 18,93,604కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 81,740 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,33,96,437కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 24,854 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 52, చిత్తూరు 332, తూర్పుగోదావరి 508, గుంటూరు 121, కడప 84, కృష్ణ 238, కర్నూలు 29, నెల్లూరు 238, ప్రకాశం 243, శ్రీకాకుళం 95, విశాఖపట్నం 150, విజయనగరం 36, పశ్చిమ గోదావరిలలో 229 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు. 


 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబు మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి ధురంధర్ YS Sharmila కీలక వ్యాఖ్యలు | Viral | Asianet News Telugu
Garikapati Gurajada : గరికపాటి నరసింహరావు గుడ్డు వివాదం.. అసలు ఈయన కొడుకు ఏం చేస్తారో తెలుసా..?