విశాఖ ఆరు హత్యలు: పోస్ట్‌మార్టం పూర్తి.. ఆరుగురికి తలకొరివి పెట్టనున్న విజయ్

Siva Kodati |  
Published : Apr 16, 2021, 08:46 PM ISTUpdated : Apr 16, 2021, 08:47 PM IST
విశాఖ ఆరు హత్యలు: పోస్ట్‌మార్టం పూర్తి.. ఆరుగురికి తలకొరివి పెట్టనున్న విజయ్

సారాంశం

విశాఖ జిల్లా పెందుర్తి హత్యల కేసులో విజయ్ కుటుంబసభ్యుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. కేజీహెచ్ నుంచి శివాజీ పాలెంకు ఆరు మృతదేహాలను తరలించారు. ఇసుక తోటలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆరు మృతదేహాలకు తలకొరివి పెట్టనున్నాడు విజయ్

విశాఖ జిల్లా పెందుర్తి హత్యల కేసులో విజయ్ కుటుంబసభ్యుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. కేజీహెచ్ నుంచి శివాజీ పాలెంకు ఆరు మృతదేహాలను తరలించారు. ఇసుక తోటలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఆరు మృతదేహాలకు తలకొరివి పెట్టనున్నాడు విజయ్. తన కుటుంబం చనిపోయిన జుత్తాడ గ్రామం తనకు శ్మశానంతో సమానమని విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు పెందుర్తిలో ఆరు హత్యల నరహంతకుడు అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని కోర్టుకు తరలించారు. 

అంతకుముందు తన కుటుంబాన్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన అప్పలరాజుతో పాటు అతనికి సహకరించిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుంటేనే పోస్ట్‌మార్టానికి అంగీకరిస్తానని విజయ్, అతని బంధువులు తేల్చిచెబుతున్నారు.

బత్తిన అప్పలరాజుతో పాటు దుర్గాప్రసాద్, గౌరీ, శీనులను కూడా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో విశాఖ మార్చురీ దగ్గర ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. జుత్తాడ శెట్టిబలిజ వీధికి చెందిన బత్తిన అప్పలరాజుకు పొరుగున నివసించే విజయ్ కుటుంబంతో పాతకక్షలు వున్నాయి .

Also Read:విశాఖ హత్యలు: పావు గంటలో ఆరుగుర్ని చంపేసి, ఆరగంట సేపు ఆమె శవం పక్కనే...

దీంతో అదను చూసి విజయ్ కుటుంబంపై దాడి చేశాడు అప్పలరాజు. ఇంట్లో వున్న ఆరుగురిని కత్తితో నరికి చంపాడు. విజయ్ తండ్రి బొమ్మిడి రమణ, భార్య ఉషారాణి, రెండేళ్ల కొడుకు విజయ్, ఆరు నెలల కుమార్తె ఉర్విషను కత్తితో అతి కిరాతకంగా నరికి చంపాడు అప్పలరాజు.

తన కుమార్తెతో విజయ్ ప్రేమ వ్యవహారం కారణంగానే అతని కుటుంబంలోని వారందరీని అప్పలరాజు హత్య చేసినట్లు తెలుస్తోంది. 2018తో విజయ్ తన కుమార్తెతో ఫోన్ చాటింగ్ చేసినట్లు అప్పలరాజు గుర్తించాడు.

దీంతో విజయ్‌పై పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి విజయ్ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు అప్పలరాజు. ఈ క్రమంలోనే విజయ్ కుటుంబం మొత్తాన్ని హతమార్చినట్లు పోలీసులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Manyam Collector Presentation on Mustabu Programme | Chandrababu | Collectors | Asianet News Telugu
Sajjala Ramakrishna Reddy Explains | YSRCP One Crore Signatures Campaign | Asianet News Telugu