కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా లక్షకు పైగా కేసులు నమోదవుతూ ఆందోళనలో పడేస్తుంది. మరణాలూ వేల సంఖ్యలోనే నమోదవుతున్నాయి.
కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా లక్షకు పైగా కేసులు నమోదవుతూ ఆందోళనలో పడేస్తుంది. మరణాలూ వేల సంఖ్యలోనే నమోదవుతున్నాయి.
కరోనా పాజిటివ్ రాగానే చికిత్సతో తగ్గిపోతుందనే నమ్మకం లేక భయంతో ఆత్మహత్యలకు పాల్పడేవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా గుంటూరుకు చెందిన ఓ యువకుడు కరోనా పాజిటివ్ తేలడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
గుంటూరు జిల్లా పెదవేగి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన షేక్ విలాయత్ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయించుకుని గురువారం గుంటూరుకు వెళ్లాడు.
శుక్రవారం ఉదయం పరీక్షల రిజల్ట్ వచ్చింది. నీకు పాజిటివ్ వచ్చిందంటూ ఫోన్ కాల్ చేసి చెప్పారు. దీంతో మనస్థాపానికి గురైన షేక్ విలాయత్.. ఇంటినుండి బైటికి వచ్చేశాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఫోన్ చేశారు.
ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఎత్తలేదు.. చివరికి ఫోన్ ఎత్తి తనకి పాజిటివ్ వచ్చిందని అందుకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి ఫోన్ కట్ చేశాడు.
వెంటనే ఆందోళన పడ్డ తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే షేక్ విలాయత్ మృతి చెందాడు. కరోనా సోకిందనే భయంతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని విలాయత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవ్వడం అందర్నీ కలిచివేసింది.