బాపట్ల సూర్యలంక బీచ్‌లో విషాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి.. కనిపించకుండా పోయిన మరో నలుగురు..

Published : Oct 04, 2022, 01:26 PM IST
బాపట్ల సూర్యలంక బీచ్‌లో విషాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి.. కనిపించకుండా పోయిన మరో నలుగురు..

సారాంశం

బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. బీచ్‌ వద్దకు విహారయాత్రకు వచ్చిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. మరో నలుగురు కనిపించకుండా పోయారు.

బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. బీచ్‌ వద్దకు విహారయాత్రకు వచ్చిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. మరో నలుగురు కనిపించకుండా పోయారు. వివరాలు.. విజయవాడ నుంచి 8 మంది విద్యార్థులు సూర్యలంక బీచ్‌కు విహారయాత్రకు వచ్చారు. వీరిలో ఇద్దరు సముద్రంలో స్నానం చేస్తుండగా నీళ్లలో మునిగిపోయారు. వారి మృతదేహాలు తీరానికి కొట్టుకుని వచ్చాయి. మరో ఇద్దరిని స్థానిక మత్స్యకారులు రక్షించారు. అయితే మరో నలుగురు ఆచూకీ తెలియాల్సి ఉంది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సూర్యలంక బీచ్ వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. విజయవాడ నుంచి 8 మంది విద్యార్థులు బీచ్‌కు వచ్చారని.. ఇద్దరు మృతిచెందారని, ఇద్దరు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే మిగిలిన నలుగురు ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. వారు బయటకు వచ్చారని చెబుతున్నారని.. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టుగా తెలిపారు. 

ఇక, మృతులను అభి, సిద్ధూలుగా గుర్తించారు. వీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారని తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

YS Jagan Review Meeting with YSRCP Regional Coordinators | వై ఎస్ జగన్ కీలక సమావేశం | Asianet Telugu
స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu