మూర్తి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి.. ఏర్పాట్లను సమీక్షిస్తున్న తానా

By sivanagaprasad kodatiFirst Published Oct 3, 2018, 10:46 AM IST
Highlights

అమెరికాలో అలస్కా వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన గీతం యూనివర్సిటీ అధినేత, ఎమ్మెల్సీ డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. ప్రమాదం జరిగిన తర్వాత మూర్తితో పాటు మరణించిన మిగిలిన వారి భౌతికకాయాలను అలస్కా స్టేట్ మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్‌కు తరలించారు.

అమెరికాలో అలస్కా వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన గీతం యూనివర్సిటీ అధినేత, ఎమ్మెల్సీ డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. ప్రమాదం జరిగిన తర్వాత మూర్తితో పాటు మరణించిన మిగిలిన వారి భౌతికకాయాలను అలస్కా స్టేట్ మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్‌కు తరలించారు.

అక్కడ ఎంవీవీఎస్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆయనతో పాటు మరణించిన వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వీబీఆర్ చౌదరి (చిన్నా) మృతదేహాలను కూడా అక్కడే ఉంచారు. అయితే వీరికి రేపు ఉదయం పోస్ట్‌మార్టం చేస్తారని తెలుస్తోంది.

మరోవైపు ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకట్ కడియాల అలస్కా రీజినల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన వెన్నెముకకి శస్త్రచికిత్స జరగడంతో ప్రస్తుతం కోలుకుంటున్నారు. మూర్తి మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తానా అధ్యక్షుడు సతీశ్ వేమన, కార్యదర్శి అంజయ్య చౌదరి లావు, కోశాధికారి రవి పొట్లూరి, ప్రసాద్ తోటకూర తదితరులు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. 

లాస్ ఏంజెల్స్ నుంచి అలస్కా వెళుతుండగా మూర్తి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎంవీవీఎస్‌తో పాటు బసవపున్నయ్య వెలువోలు, ప్రసాద్ వీరమాచినేని, చిన్నా దుర్మరణం పాలవ్వగా.. వెంకట్ కడియాల తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ప్రఖ్యాత వైల్డ్ లైఫ్ సఫారీ చూసేందుకు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. 

మూర్తిగారిని మొన్ననే మండలి సమావేశాల్లో చూశా.. ఇంతలోనే: నారా లోకేశ్

ఎంవీవీఎస్ మూర్తి మరణం.. రోడ్డు ప్రమాదాల్లోనే నేతలను కోల్పోతున్నాం: చంద్రబాబు ఆవేదన

ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం: విశాఖ బయలు దేరిన గంటా

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత, ‘గీతం’ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం
 

click me!