ఎంవీవీఎస్ మూర్తి మరణం.. రోడ్డు ప్రమాదాల్లోనే నేతలను కోల్పోతున్నాం: చంద్రబాబు ఆవేదన

sivanagaprasad kodati |  
Published : Oct 03, 2018, 09:22 AM ISTUpdated : Oct 03, 2018, 09:23 AM IST
ఎంవీవీఎస్ మూర్తి మరణం.. రోడ్డు ప్రమాదాల్లోనే నేతలను కోల్పోతున్నాం: చంద్రబాబు ఆవేదన

సారాంశం

గీతం యూనివర్సిటీ అధినేత, ఎమ్మెల్సీ డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి మరణం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

గీతం యూనివర్సిటీ అధినేత, ఎమ్మెల్సీ డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి మరణం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా మూర్తి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

విద్యావేత్తగా, విద్యాదాతగా ఆయన ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని సీఎం అన్నారు.. గాంధీజీ ఆదర్శాల కోసం పనిచేసిన ఎంవీవీఎస్ మూర్తి.. గాంధీ జయంతి రోజే మృతి చెందడం యాధృచ్చికరమన్నారు.

గీతం సంస్థను స్థాపించి లక్షలాది మంది విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దారని.. ఆయన మరణం విద్యా, రాజకీయ రంగాలకు తీరని లోటన్నారు.. రోడ్డు ప్రమాదాల్లోనే కీలక నేతలను టీడీపీ కోల్పోతుండటం కలచివేస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మూర్తి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

కొంపముంచిన నిర్లక్ష్యం: సీటు బెల్ట్ పెట్టుకోక చనిపోయిన ప్రముఖులు వీరే

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత, ‘గీతం’ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం

ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం: విశాఖ బయలు దేరిన గంటా

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్