ఎలాంటి లక్షణాలు లేవు... అయినా నాకు కరోనా పాజిటివ్: వైసిపి ఎమ్మెల్యే వీడియో

Arun Kumar P   | Asianet News
Published : Jul 03, 2020, 06:34 PM ISTUpdated : Jul 04, 2020, 10:06 AM IST
ఎలాంటి లక్షణాలు లేవు... అయినా నాకు కరోనా పాజిటివ్: వైసిపి ఎమ్మెల్యే వీడియో

సారాంశం

ఆంధ్ర  ప్రదేశ్ లో అధికారపార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది.

గుంటూరు: ఆంధ్ర  ప్రదేశ్ లో అధికారపార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన వైసిపి ఎమ్మెల్యే కిలారి రోశయ్య కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇటీవల కలెక్టరేట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈయన పాల్గొన్నారు. దీంతో ఈ మీటింగ్ లో పాల్గొన్న ఇతర ప్రజాప్రతినిధులు కూడా టెస్టులు చేయించుకుంటున్నారు. 

తనకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు తెలియజేస్తూ రోశయ్య ఓ వీడియో ప్రకటన చేశారు.  తనకు కరోనా లక్షణాలయిన దగ్గు, జలుబు, జ్వరం ఏమీ లేవని... సంపూర్ణ ఆరోగ్యంగా వున్నానన్నారు. కానీ కరోనా పాజిటివ్ గా వచ్చిన నేపథ్యంలో హోంక్వారంటైన్ లో వున్నానని... ప్రజలకు ఇకపై ఫోన్ లో మాత్రమే అందుబాటులో వుంటానని రోశయ్య వెల్లడించారు. 

వీడియో

మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 837 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే కరోనాతో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 16,934కి చేరుకొగా ప్రస్తుతం 9,096 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. మరో వైపు 7632 మంది కరోనా నుండి కోలుకొన్నట్టుగా ప్రభుత్వం వివరించింది.

 రాష్ట్రంలోని కర్నూల్  జిల్లాలో అద్యధిక కరోనా కేసులు రికార్డయ్యాయి. ఈ జిల్లాలో 2236 కేసులు నమోదయ్యాయి. కర్నూల్ తర్వాతి స్థానంలో అనంతపురం జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 1972 కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో కృష్ణా జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 1611 కేసులు నమోదయ్యాయి. నాలుగో స్థానంలో గుంటూరు జిల్లా నిలిచింది. ఇక్కడ 1610 కేసులు రికార్డయ్యాయి.

గత 24 గంటల్లో విదేశాల నుండి వచ్చినవారిలో ఇద్దరికి కరోనా సోకింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారిలో 46 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది.
 

PREV
click me!

Recommended Stories

Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు | YSRCP | Asianet News Telugu