వెరీ గుడ్ సీఎం: జగన్‌పై పవన్ కల్యాణ్ ప్రశంసల జల్లు

By Siva KodatiFirst Published Jul 3, 2020, 6:17 PM IST
Highlights

ఏపీలో వైద్య ఆరోగ్య సదుపాయాలను మరింత పటిష్టం చేసేందుకు గాను ప్రభుత్వం 104, 108 వాహనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి జనసేన అధినేత, పవన్ కల్యాణ్ చేరారు

ఏపీలో వైద్య ఆరోగ్య సదుపాయాలను మరింత పటిష్టం చేసేందుకు గాను ప్రభుత్వం 104, 108 వాహనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి జనసేన అధినేత, పవన్ కల్యాణ్ చేరారు.

ప్రస్తుతం కరోనా కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మెడికల్ ఎమర్జెన్సీ లాంటి పరిస్ధితుల్లో అంబులెన్స్‌‌ను ప్రారంభించడాన్ని పవన్ అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

‘ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి- శ్రీ జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం - అభినందనీయం. అలాగే,గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో, ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు - అభినందనీయం.’ అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

Also Read:104,108 వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్ (ఫోటోలు)

అలాగే, ‘ఇది ప్రపంచానికే గడ్డు కాలం , అందుకే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ, రాష్ట్ర - కేంద్ర ప్రభుత్వాలికి, సహకరిద్దాం - క్షేమంగా ఉందాం.’ అంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

బుధవారం 108, 104 అంబులెన్స్‌లను జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 08, 104 అంబులెన్స్ లను 1088 ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ అంబులెన్స్ లలో అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు.

Also Read:108 డ్రైవర్లు, టెక్నీషీయన్లకు జగన్ గుడ్ న్యూస్: భారీగా పెరిగిన జీతాలు

పసిపిల్లలకు కూడ ప్రతి జిల్లాలో రెండు అంబులెన్స్ లను కేటాయించామన్నారు. గత ప్రభుత్వంలో 108 అంబులెన్స్ లు అరకొరగా ఉండేవి. 104 అసలు కన్పించకపోయేవని సీఎం చెప్పారు. 

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలకు కూడ ఫోన్ చేసిన 20 నిమిషాలలోపుగానే అంబులెన్స్ లు ప్రజల వద్దకు చేరుకొంటాయని చెప్పారు. 

 

ఆం. ప్ర గౌరవ ముఖ్యమంత్రి- శ్రీ జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో
ఆరంభించడం - అభినందనీయం ..

అలాగే,గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో , ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు - అభినందనీయం..

— Pawan Kalyan (@PawanKalyan)
click me!