మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అరెస్ట్ కు రంగం సిద్దం

Published : Aug 27, 2019, 05:06 PM IST
మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అరెస్ట్ కు రంగం సిద్దం

సారాంశం

మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అరెస్ట్ కు రంగం సిద్దం చేశారు పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది.

శ్రీకాకుళం: మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌ అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించారనే ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్ట్ చేసేందుకు సరుబుజ్జిలి పోలీసులు ఆముదాలవలసకు వచ్చారు. అయితే ఆయన మంగళవారం నాడు అందుబాటులో లేరు.

శ్రీకాకుళం జిల్లాలోని ఓ ఎంపీడీఓను బెదిరించారని కూన రవికుమార్ పై కేసు నమోదైంది. ఈ విషయమై పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డిని  ఉద్యోగులు కలిసి వినతి పత్రం కూడ ఇచ్చారు. ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని  కూడ తాను ఆదేశాలు ఇచ్చినట్టుగా మంత్రి పెద్దిరెడ్డి మంగళవారం నాడు ప్రకటించారు.

సరుబుజ్జిలి  పోలీసులు మంగళవారం నాడు ఆముదాలవలసకు వచ్చారు. అయితే ఆముదాలవలసలో కూన రవికుమార్ లేరు. రవికుమార్ అందుబాటులో లేకపోవడంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్