హైదరాబాద్‌లో ఉగ్రదాడికి కుట్ర.. భగ్నం చేసి ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

Published : May 19, 2025, 08:42 AM IST
charminar hyderabad

సారాంశం

సిరాజ్ అనే వ్యక్తి విజయనగరంలోనే పేలుడు పదార్థాల్ని సిద్ధం చేశాడు. ఆ తర్వాత సమీర్‌తో కలసి వాటిని హైదరాబాద్‌కు తరలించి… దాడి చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ అంతకంటే ముందే ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. 

హైదరాబాద్‌లో బాంబు దాడి కుట్రను భగ్నం చేశామని తెలంగాణ పోలీసులు వెల్లడించారు. 

విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కి చెందిన సమీర్ అనే ఇద్దరు వ్యక్తులు నగరంలో బాంబు పేల్చేందుకు ప్రయత్నించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

వీరిద్దరూ కలిసి మొదటగా ‘డమ్మీ బ్లాస్ట్’ చేసి.. తర్వాత భారీ దాడి చేయాలని నిర్ణయించారు.

సౌదీ అరేబియాలోని ఐసిస్ మాడ్యూల్‌ నుంచే పక్కా ప్లాన్‌

ఈ ఇద్దరికి మార్గనిర్దేశం చేసినది ఐసిస్‌తో సంబంధాలున్న గుంపే. అందులోను సౌదీ అరేబియాలో ఉన్న మాడ్యూల్‌ నుంచే వీరికి దిశానిర్దేశం వచ్చిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఏక్కడ బాంబు పెట్టాలి? ఎలా ప్లాన్ చేయాలని ? అనే దానిపై వీరికి సౌదీ నుంచి సూచనలు అందాయి. దాంతో నగరంలోని కొన్ని కీలక ప్రాంతాలపై వీరిద్దరూ రెక్కీ నిర్వహించారు.

వాస్తవానికి సిరాజ్ అనే వ్యక్తి విజయనగరంలోనే పేలుడు పదార్థాల్ని సిద్ధం చేశాడు. ఆ తర్వాత సమీర్‌తో కలసి వాటిని హైదరాబాద్‌కు తరలించి… దాడి చేసేందుకు ప్లాన్ చేశారు. 

కానీ అంతకంటే ముందే ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ కలసి వీరిని అదుపులోకి తీసుకున్నాయి.

ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో పహల్గామ్ దగ్గర టూరిస్టులపై జరిగిన కాల్పుల ఘటన తర్వాత దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థ మరింత కట్టుదిట్టం చేశారు. అనేక రాష్ట్రాల్లో సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో హైదరాబాద్‌లో పేలుడు కుట్రను అడ్డుకున్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

22 AP Youth Rescued from Cyber-Slavery in Myanmar: కరెంటు షాక్ పెట్టేవాళ్ళు | Asianet News Telugu
IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం