రాత్రి పూట వచ్చి తలుపులు కొడుతున్నారు: సత్యంబాబు

By Nagaraju TFirst Published Jan 31, 2019, 10:59 AM IST
Highlights

ఇప్పటికే అయేషా మర్డర్ కేసు మచ్చ పడటం వల్ల పని దొరకడం లేదని ఏడుస్తుంటే పనిదొరికితే అక్కడకు పోలీసులు రావడం చూసి ఎవరూ పని ఇవ్వడం లేదన్నారు. మరోవైపు తన తల్లి మానసికంగా ఇబ్బందులకు గురై ఎటు వెళ్లిపోయారో కూడా తెలియడం లేదని స్పష్టం చేశారు. 
 

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యకేసుకు సంబంధించి సీబీఐ విచారణకు తాను సహకరిస్తున్నట్లు సత్యంబాబు స్పష్టం చేశారు. అయేషా హత్య కేసులో తాను నిర్దోషినని హైకోర్టు స్పష్టం చేసిందని అయితే సీబీఐ విచారణలోనూ అదే తేలుతుందని స్పష్టం చేశారు. 

నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను కలిసేందుకు హైదరాబాద్ వచ్చిన సత్యంబాబు ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు చెప్పుకొచ్చాడు సత్యంబాబు. చెయ్యని నేరానికి అకారణంగా కేసులు పెట్టించి జైలుకు పంపించారని ఆరోపించారు. 

జైలు నుంచి విడుదలైన తర్వాత తాను ఎంతో సంతోషించానని అయితే పోలీసుల వేధింపుల వల్ల ఎక్కడా తాను పనిచెయ్యలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ విచారణకు తాను సహకరిస్తానని ఆ కేసులో న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

తాను ఇంట్లో ఉండగా వచ్చి పోలీసులు తీసుకెళ్లి కేసులు పెట్టారని ఆ తర్వాత జైలుకెళ్లినట్లు తెలిపారు. సీబీఐ తన నివాసానికి వచ్చి విచారణ జరిపారని తన స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారని తెలిపారు. ఇకపోతే తాను పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

తాను జైల్లో ఉన్న సమయంలో రౌడీషీట్ ఓపెన్ చేశారని ఆ కేసు ఉందంటూ విచారణ పేరుతో నిత్యం పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. గతంలో తనపై అకారణంగా కేసులు పెట్టించి జైల్లో పెట్టారని ఇప్పుడు రౌడీషీట్ ఓపెన్ చేసి తనను వేధిస్తున్నారని తనకు న్యాయం జరిగాలని కోరుతూ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. 

రాత్రిపూట పోలీసులు ఇంటికి రావడం తలుపులు కొట్టడం చేస్తుంటే తన సోదరి భయపడిపోతుందని చెప్తున్నాడు. రోజు గడవటం చాలా కష్టం ఉందన్నారు. తనకు ఎక్కడా పని దొరకడం లేదని, పనికి వెళ్దామంటే అక్కడకు పోలీసులు వస్తుండటంతో పని ఇచ్చేవారు కూడా ఇవ్వడం లేదని వాపోయాడు. 

ఇప్పటికే అయేషా మర్డర్ కేసు మచ్చ పడటం వల్ల పని దొరకడం లేదని ఏడుస్తుంటే పనిదొరికితే అక్కడకు పోలీసులు రావడం చూసి ఎవరూ పని ఇవ్వడం లేదన్నారు. మరోవైపు తన తల్లి మానసికంగా ఇబ్బందులకు గురై ఎటు వెళ్లిపోయారో కూడా తెలియడం లేదని స్పష్టం చేశారు. 

తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదన్నారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. అలాగే నిర్భయ కేసులో ఎలాంటి న్యాయం జరిగిందో అయేషా మీరా హత్య కేసులో కూడా అలాంటి న్యాయమే జరగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. పోలీసులు వేధింపులతో జీవితంపై విరక్తి వస్తుందని సత్యంబాబు వాపోయాడు. 

click me!