సాక్షి డైలీ కాపీలను దగ్ధం చేసిన డ్వాక్రా మహిళలు

Published : Jan 31, 2019, 10:42 AM IST
సాక్షి డైలీ కాపీలను దగ్ధం చేసిన డ్వాక్రా మహిళలు

సారాంశం

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక ప్రతులను డ్వాక్రా మహిళలు దగ్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన నగదు బదిలీపై రాసిన వార్తాకథనానికి నిరసనగా వారు ఆ పనిచేశారు. 

కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక ప్రతులను డ్వాక్రా మహిళలు దగ్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన నగదు బదిలీపై రాసిన వార్తాకథనానికి నిరసనగా వారు ఆ పనిచేశారు. 

చంద్రబాబు నగదు బదిలీ పథకంపై ఇచ్చిన హామీలో నిజం లేదని, అది పెట్టుబడి బదిలీ పథకం తప్ప మరోటి కాదని, ఆ రుణాన్ని డ్వాక్రా సభ్యులు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని సాక్షి దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. 

ఆ వార్తాకథనంపై ఆగ్రహించిన డ్వాక్రా మహిళలు కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు బుధవారం సాయంత్రం ఆందోళనకు దిగి సాక్షి దినపత్రిక ప్రతులను తగులబెట్టారు. అటువంటి వార్తాకథనాలు ప్రచురించకూడదని వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.  

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu