కర్నూలు జిల్లా దేవరగట్టులో అర్థరాత్రి కర్రల సమరం, వందమందికి గాయాలు (వీడియో)

By AN Telugu  |  First Published Oct 16, 2021, 1:26 PM IST

devaragattuలో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండమీద మాళ మల్లేశ్వరస్వామి దసరా banni utsavamనికి ఎంతో ప్రత్యేకత ఉంది. 


అమరావతి : కర్నూలు జిల్లాలోని devaragattuలో అర్థరాత్రి కర్రల సమరం జరిగింది. బన్నీ ఉత్సవంతో ఉత్సాహంగా పాల్గొన్న గ్రామస్థులు కర్రలతో యుద్ధం చేశారు. యేటా జరిగే ఈ కర్రల సమరంలో హింస జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా హింస చోటు చేసుకుంది. ఈ సమరంలో వందమందికి పైగా గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.  క్షతగాత్రులను ఆదోనిలోని ఆసుపత్రికి తరలించారు. 

"

Latest Videos

అయితే, ఇంత హింస జరుగుతున్నా కూడా పోలీసులు ఈ ఉత్సవాలను ఆపలేకపోతున్నారని వారిపై humanrights commission ఆగ్రహం చేస్తున్నారు. దీంతో ఈ బన్నీ ఉత్సవంలో పాల్గొనే 22 గ్రామాల్లో పోలీసులు ముందుగానే కొన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవంలో పాల్గొని భక్తుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నాలు చేశారు.విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో లైట్ల ఏర్పాట్లను కూడా చేశారు. ఇక ఈ ఉత్సవం దసరా, ఆ తెల్లవారి రెండు రోజులు వరకు జరగనుండగా అక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు పోలీసులు. 

devaragattuలో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండమీద మాళ మల్లేశ్వరస్వామి దసరా banni utsavamనికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్సవాల సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానిక నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు. 

శుక్రవారం తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో dussehra ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ రోజు ప్రజలంతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పించి పండుగని జరుపుకున్నారు. అలాగే kurnool జిల్లా హోళగుంద మండలం దేవరగట్టు ప్రాంతంలో దసరా రోజు కర్రల యుద్ధం ఉత్సవాలు జరిగాయి. ఇందులో తలలు పగలగొట్టుకుని మరి యుద్ధం చేస్తారు. మాల మల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవాల్లో ప్రతి ఏడాది ఈ యుద్ధం ఆచారంగా జరుగుతుంది.
 
ఇక ఈ యేడు కూడా ఈ ఉత్సవం జరిగింది. ఈ యుద్ధంపై స్థానికులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. అనుకున్నట్టుగానే హింస జరిగింది. ఇటువంటి ఘోరమైన యుద్ధంలో తలలు పగులుతాయని అంతకుముందే మానవ హక్కుల కమిషన్ బాగా సీరియస్ అయ్యాయి. అంతేకాకుండా కర్నూలు కలెక్టర్, ఎస్పీలకు కూడా నోటీసులు జారీ చేశారు.

దేవరగట్టు బన్ని ఉత్సవంలో చెలరేగిన హింస : వందమందికి పైగా గాయాలు

వందేళ్ళ కిందట దేవరగట్టులో వెలసిన మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం తర్వాత విగ్రహాలను సొంతం చేసుకునేందుకు ఆ ప్రాంత పరిసరాల్లో ఉన్న 12 గ్రామాల ప్రజలు రెండు విభాగాలుగా విడిపోతారు. ఇక ఈ రెండు వర్గాల మధ్య జరిగే ఉత్సవమే కర్రల యుద్ధం. ఇందులో పాల్గొనే ప్రజలు కర్రలకు ఇనుప చువ్వను బిగించి ఉత్సవంలో పాల్గొంటారు. కొన్ని కొన్ని సార్లు ఇందులో హింసలు కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ఈ ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఇది తమ ఆచారమని తెలుస్తుంది.

ఇక ఈ ఉత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి లక్షలకు పైగా జనం తరలి వస్తారు. ఈ నేపథ్యంలో ఇంతమంది ప్రజల మధ్య ఎటువంటి దాడులు జరగబోతుందో అని ముందుగానే పలు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా విద్యుత్, వైద్యశాఖ, ఫైర్ సిబ్బందిలను కూడా ఏర్పాటు చేశారు.

click me!