ఏపీలో 400 కిలోల గాడిద మాంసం స్వాధీనం.. 7 గురిని అరెస్టు చేసిన పోలీసులు

Published : Oct 11, 2022, 12:03 PM IST
ఏపీలో 400 కిలోల గాడిద మాంసం స్వాధీనం.. 7 గురిని అరెస్టు చేసిన పోలీసులు

సారాంశం

భారత ప్రభుత్వం నిషేధించినా.. అక్రమంగా గాడిదలను వదించి మాంసం అమ్ముతున్న ఏడుగురిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందు నిర్వహించిన దాడుల్లో 400 కేజీల మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

బాపట్ల పట్టణంలోని నాలుగు వేర్వేరు ప్రాంతాల నుండి 400 కిలోల గాడిద మాంసాన్ని ఏపీ పోలీసులు ఆదివారం రాత్రి ప‌ట్టుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ దాడుల్లో గాడిద మాంసం, శరీర భాగాలు, తలలు, కాళ్లు, తోకలకు అమర్చిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మాంసాన్ని కిలో రూ.600లకు విక్రయిస్తున్నారు.

వైరల్ వీడియో: ప్రమాదం ఇలా కూడా జరుగుతుందా..?

ఈ దాడుల్లో పోలీసులకు సహకరించిన వన్యప్రాణి కార్యకర్తలు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో గాడిదలను చంపే ఆచారం చాలా ఏళ్లుగా ఉందని, అయితే కబేళాలపై దాడులు జరగడం ఇదే తొలిసారి అని తెలిపారు. కాగా.. శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, గాడిద మాంసం వెన్నునొప్పి, ఆస్తమాను నయం చేయగలదని, కామోద్దీపనగా కూడా ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ లోని కొన్నిప్రాంతాలలో విస్తృతమైన నమ్మకం ఉందని సీనియర్ పోలీసు అధికారులు చెప్పారని ‘టీవోఐ’ నివేదించింది. గాడిద రక్తం తాగడం వల్ల మానవ శరీరం ఎంతటి నొప్పినైనా, ఎలాంటి హింసనైనా తట్టుకోట్టుగలదని ఓ విశ్వాసం ఉంది. 

అందుకే ఈ మాంసాన్ని ఏపీలోని ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో విరివిగా విక్రయిస్తున్నారు. IPCలోని సెక్షన్ 429 ప్రకారం గాడిదలను వధించడాన్ని భారతదేశం నిషేధించింది. దీనిని ఉల్లంఘిస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం కూడా కొన్ని సంద‌ర్భాల్లో ఉప‌యోగిస్తారు. అంతే కాకుండా ఆహార భద్రత, ప్రమాణాల చట్టం- 2006 ప్రకారం గాడిద మాంసం వినియోగం చట్టవిరుద్ధం.

తల్లి ముందే మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం, ఇద్దరి అరెస్ట్...

దేశంలో గాడిదల సంఖ్య బాగా పడిపోయిన తరుణంలో తాజా నిర్బంధం వచ్చింది. 2012లో ఈ జంతువుల జనాభా 0.32 మిలియన్ల ఉండ‌గా.. 2019లో 0.12 మిలియన్లకు తగ్గిపోయిందని 2019లో లైవ్ స్టాక్ సెన్సస్ పేర్కొంది. చైనాలో గాడిద తోలుకు డిమాండ్ పెరగడం క్షీణతకు ఒక కారణమని భావిస్తున్నారు. 

‘‘ గాడిదలు సున్నితమైన జంతువులు. ఇవి తమ కుటుంబాలు, స్నేహితులతో లోతైన బంధాలను ఏర్పరుస్తాయి. వివిధ రకాల శబ్దాల ద్వారా ఒకరితో ఒకరు సంభాషించుకుంటాయి. అయినప్పటికీ ఏపీలో ఈ జంతువులు మాంసం కోసం అపహరణకు గురవుతున్నాయి.’’ అని పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) ఇండియా మేనేజర్ ఆఫ్ క్రూయెల్టీ రెస్పాన్స్ ప్రాజెక్ట్ మీట్ అషర్ తెలిపారు. 

నెమలి ఈకలు ఇస్తానని ఆశపెట్టి, బాలికపై లైంగిక దాడి..మరణించే వరకు జైలు శిక్ష..

ఈ దాడుల్లో పోలీసులకు పెటా తో పాటు యానిమల్ రెస్క్యూ ఆర్గ‌నైజేష‌న్ కు చెందిన గోపాల్ సురబత్తుల, హెల్ప్ ఫ‌ర్ యానిమల్స్ సొసైటీకి చెందిన టి అనుపోజు, తూర్పుగోదావరి ఎస్పీసీఏకు చెందిన విజయ్ కిషోర్ పాలిక సహకరించారు. స్థానిక ఆహార భద్రత అధికారి ఫిర్యా దు మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు చీరాల వ‌న్ టౌన్ ఎస్ఐ అహ్మ ద్ జానీ తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu