నెమలి ఈకలు ఇస్తానని ఆశపెట్టి, బాలికపై లైంగిక దాడి..మరణించే వరకు జైలు శిక్ష..

By SumaBala Bukka  |  First Published Oct 11, 2022, 9:06 AM IST

ఇంట్లో ఒంటరిగా ఉన్న ఏడేళ్ల చిన్నారిని మభ్య పెట్టి అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి చనిపోయేవరకు కారాగారశిక్ష విధిస్తూ విజయవాడ కోర్టు తీర్పునిచ్చింది. 


విజయవాడ : ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి జీవితకాలం కఠిన కారాగారశిక్ష విధిస్తూ.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కోర్టు న్యాయమూర్తి రజిని సోమవారం తీర్పునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా నున్నకి చెందిన బాలిక (7) ఈ ఏడాది ఫిబ్రవరి 24న స్కూలుకు వెళ్లి వచ్చి ఇంటి వద్ద ఉంది. ఆసమయంలోనే ఆ ఇంటి సమీపంలో ఉంటున్న అనిల్ (30) ఆ బాలికకు నెమలీ ఈకలు ఇస్తానని ఆశ చూపి తాను పనిచేస్తున్న టెంట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అనిల్ చేసిన పనిని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె నున్న  పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు కేసు నమోదు చేసి.. కేసును దిశా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. దిశా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి పై విధంగా మరణించేవరకు జైలులో ఉండాలని కఠిన కారాగార శిక్ష, రూ. మూడు వేల జరిమానా విధించారు. బాలిక  కుటుంబానికి రూ. ఐదు లక్షల నష్టపరిహారం అందేలా చూడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ను ఆదేశించారు.

Latest Videos

undefined

ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు..సగం కాలిన తరువాత..

ఇదిలా ఉండగా, హర్యానాలోని కైతల్ జిల్లాలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. హతమార్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గత ఆదివారం తమ ఏడేళ్ల చిన్నారి కనిపించడం లేదని.. కుటుంబ సభ్యులు కైతల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. చుట్టు పక్కల గాలింపు చర్యలు చేపట్టగా.. సగం కాలి ఉన్న చిన్నారి మృతదేహం అటవీ ప్రాంతంలో బయటపడింది. తప్పిపోయిన చిన్నారి 19యేళ్ల యువకుడితో ఎక్కడితో వెడుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. 

ఆ యువకుడిని విచారించగా.. బాలికను ప్రలోభపెట్టి తన వెంట తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడించాడు. చిన్నారి గట్టిగా అరవడం వల్ల.. దొరికిపోతాననే భయంతో బాలిక ముఖం మీద గట్టిగా నొక్కి చంపి మృతదేహం మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

ఇలాంటి ఘటనే ఆగస్ట్ లో ముంబైలో వెలుగుచూసింది. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు  తేజస్ దల్వీ (24)ని పూణే జిల్లా పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు. సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించిన తేజస్  తల్లి సుజాత దల్వీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత స్థానికులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ కోఠార్ణే గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. 

దీంతో గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అదనంగా పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెడితే... పూణే జిల్లా మావళ్ తాలూకా కోఠార్ణే గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక ఆగస్ట్ నెల రెండో తేదీన కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఊరంతా గాలించినా బాలిక ఆచూకీ లభించలేదు. చివరకు బాలిక తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కూడా తమదైన శైలిలో వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. చివరకు బుధవారం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల వెనకాల నగ్న స్థితిలో ఉన్న బాలిక మృతదేహం లభించింది. 

click me!