అశ్లీల కార్యకలాపాలకు అడ్డాగా మంగినిపూడి బీచ్... రిసార్ట్ పై పోలీసుల దాడి, పట్టుబడ్డ జంటలు

Arun Kumar P   | Asianet News
Published : Aug 05, 2021, 01:21 PM IST
అశ్లీల కార్యకలాపాలకు అడ్డాగా మంగినిపూడి బీచ్... రిసార్ట్ పై పోలీసుల దాడి, పట్టుబడ్డ జంటలు

సారాంశం

అశ్లీల కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్న సమాచారంతో కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ లోని ఓ రిసార్ట్ పై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 8జంటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ లో ఓ రిసార్ట్ పై పోలీసులు దాడులు చేశారు. మచిలీపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి యువతీ యువకులు బీచ్ సందర్శన పేరుతో వచ్చి అసభ్య కార్యకలాపాలు చేపడుతున్నారని... ఇందుకు ఓ రిసార్ట్ అడ్డాగా మారింది. దీనిపై సమాచారం అందుకున్న మచిలీపట్నం రూరల్ పోలీసుల బుధవారం రిసార్ట్ పై దాడులు చేశారు.

రిసార్ట్ పై పోలీసుల దాడిని గుర్తించిన కొన్ని జంటలు పక్కనే వున్న తోటల్లోకి పరుగుపెట్టారు. మరికొన్ని జంటలు పోలీసులకు చిక్కారు. పట్టుబడిన వారిని స్టేషన్ కు తరలించారు. ఈ వ్యహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు రిసార్ట్ నిర్వహకుల కోసం ఆరా తీస్తున్నారు.  

read more  బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారం..!

రిసార్ట్ నిర్వహకులు అసభ్య కార్యకలాపాలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారని... మచిలీపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు రూంలను గంటల లెక్కన అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో జంట నుండి గంటకు రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం.

అనుమానాస్పదంగా చిక్కిన ఎనిమిది జంటలను స్టేషన్ కు తరలించారు పోలీసులు. అయితే పోలీసులకు చిక్కిన వారిలో కొంతమంది ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రముఖులు ఎవరన్నదానిపై మచిలీపట్నంలో వివిధ రకాలుగా ప్రచారం జరుగుతోంది. 


 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు