కోడి పుంజు గుడ్డు పెట్టింది.. ఇదెక్కడి విచిత్రం..!

Published : Aug 05, 2021, 09:53 AM ISTUpdated : Aug 05, 2021, 10:07 AM IST
కోడి పుంజు గుడ్డు పెట్టింది.. ఇదెక్కడి విచిత్రం..!

సారాంశం

ప్రస్తుతం ఆ పుంజు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ కోడిపుంజును, పిల్లలను చూసి వెళ్తున్నారు. 

కోడిపెట్ట గుడ్డు పెట్టడం సర్వ సాధారణం. కానీ.. ఎక్కడైనా కోడి పుంజు గుట్టుపెట్టడం విన్నారా..? నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. గుడ్లు పెట్టడమే కాదు.. ఆ గుడ్డును పొదిగి పిల్లలను కూడా చేసింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా తొట్టంబేడు మండలంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లా తొట్టంబేడు మండలంలోని పెద్దకన్నలి ఎస్టీ కాలనీలోని సుబ్రహ్మణ్యం రెడ్డి ఇంట్లో నాలుగు కోళ్లతోపాటు.. ఒక పుంజు కూడా ఉంది. ఈ కోడి పుంజు ఐదు గుడ్లు పెట్టింది. ఇదేంటి గుడ్లు పెడుతోందని యజమాని ఆశ్చర్యపోయాడు. అయితే ఏం చేస్తుందో చూడాలని, ఆ గుడ్లు తీసుకెళ్లి పుంజు కిందపెట్టడంతో అది 5 పిల్లలను పొదిగింది. 

ప్రస్తుతం ఆ పుంజు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ కోడిపుంజును, పిల్లలను చూసి వెళ్తున్నారు. అయితే పుంజు గుడ్లు పెట్టడంపై వెటర్నరీ అధికారి వీరభద్రరెడ్డి వివరణ ఇచ్చారు. జన్యుపరమైన కారణాలతో ఇలా అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతాయని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?