హత్య, యాసిడ్ దాడిపై గూగుల్‌లో సెర్చ్.. గన్ కోసం పాట్నాలోనే 20 రోజులు : నెల్లూరు కాల్పుల కేసులో కీలక విషయాలు

Siva Kodati |  
Published : May 19, 2022, 06:57 PM ISTUpdated : May 19, 2022, 07:01 PM IST
హత్య, యాసిడ్ దాడిపై గూగుల్‌లో సెర్చ్.. గన్ కోసం పాట్నాలోనే 20 రోజులు : నెల్లూరు కాల్పుల కేసులో కీలక విషయాలు

సారాంశం

నెల్లూరు జిల్లాలో ప్రియురాలిపై కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్న సురేష్ రెడ్డి కేసులో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడి తుపాకీని పాట్నాలో కొన్నాడని... ఇందుకోసం అక్కడే 20 రోజుల పాటు వున్నాడని పోలీసులు తెలిపారు.   

నెల్లూరు జిల్లా (nellore district) పొదలకూరు (podalakur) మండలం తాటిపర్తిలో (tatiparthi) ఇటీవల చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. పెళ్లికి కావ్య అంగీకరించకపోవడంతోనే సురేష్ రెడ్డి (suresh reddy) కక్ష పెంచుకున్నాడని ఏఎస్పీ మీడియాకు తెలిపారు. వివిధ నెంబర్ల ద్వారా కావ్యను (kavya) వేధించాడని.. యాసిడ్ అటాక్స్, హత్య  చేయడం గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశాడని ఏఎస్పీ పేర్కొన్నారు. పిస్టల్ కోసం పాట్నాలోని బ్యాంక్‌లో సురేష్ రెడ్డి నగదును డ్రా చేశాడని ఆయన పేర్కొన్నారు. పిస్టల్ కోసం 20 రోజుల పాటు పాట్నాలో మకాం వేశాడని చెప్పారు. పాట్నాలో ఉమేష్, రమేష్‌లు సురేష్ రెడ్డికి పిస్టల్ అమ్మారని ఏఎస్పీ వెల్లడించారు. పరారీలో వున్న ఉమేష్ కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు.

Also Read:79 నెంబర్లతో కావ్యకు సురేష్ రెడ్డి ఫోన్లు: రెండేళ్లుగా కావ్యకు సురేష్ రెడ్డి వేధింపులు

కాగా.. మే 9వ తేదీ సోమవారం మధ్యాహ్నం కావ్యరెడ్డి ఇంటికి వెళ్లిన సురేష్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. కావ్యను పెళ్లి చేసుకోవాలని భావించిన అతను ఈ విషయమై ఆమె కుటుంబ సభ్యులతో చర్చించాడు. అయితే కావ్య, సురేష్ రెడ్డితో పెళ్ళికి నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న సురేష్ రెడ్డి మే 9న కావ్య ఇంటికి వెళ్లి తుపాకీతో ఆమెను కాల్చి చంపాడు. అనంతరం తాను కూడా తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సురేష్ రెడ్డి, కావ్యలు గతంలో చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేసేవారు. కోవిడ్ కారణంగా గడిచిన రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోం లో భాగంగా వీరిద్దరూ సొంత ఊరు నుంచే పని చేస్తున్నారు. వీరిద్దరిదీ ఒకే ఊరు. అంతేకాదు సురేష్ రెడ్డి దుందుడుకు స్వభావం ఉన్న వ్యక్తి అని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు.

సురేష్ రెడ్డి ఓ పైకో : కావ్య బంధువు
సురేష్ రెడ్డి ఓ సైకో అని కావ్య బంధువు ఒకరు తెలిపారు. సురేష్ రెడ్డి గురించి అతని సన్నిహితులు చాలామంది నెగటివ్ గా  చెబుతున్నారన్నారు. కావ్య పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్లే కక్షతో సురేష్ రెడ్డి  ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని చెప్పారు. సురేష్ రెడ్డి గురించి తమకు ఇంతకు ముందు ఈ విషయాలు తెలియవని చెప్పారు.

దర్యాప్తులో భాగంగా సురేష్ రెడ్డికి తుపాకీ ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీశారు. నిందితుడు ఉపయోగించిన తుపాకీలో బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అయితే సురేష్ రెడ్డికి, కావ్యల మధ్య వయస్సు మధ్య తేడా కూడా ఎక్కువగా ఉందని కావ్య పేరేంట్స్ చెబుతున్నారు. ఇది కూడా ఈ పెళ్లికి ఆటంకంగా మారింది.
 

PREV
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu