అందుకే సీఎస్‌ను కలవాలని అనుకున్నాను.. నన్ను కలవడం ఆయనకు ఇష్టం లేదేమో?: ఏబీ వెంకటేశ్వరరావు

Published : May 19, 2022, 05:35 PM IST
అందుకే సీఎస్‌ను కలవాలని అనుకున్నాను.. నన్ను కలవడం ఆయనకు ఇష్టం లేదేమో?: ఏబీ వెంకటేశ్వరరావు

సారాంశం

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు గురువారం జీఏడీలో రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. సీఎస్‌కు రిపోర్ట్ చేసేందుకు జీఏడీకి వెళ్లానని చెప్పారు. ఆయన పీఏకు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వచ్చినట్టుగా చెప్పారు. 

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు గురువారం జీఏడీలో రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. సీఎస్‌కు రిపోర్ట్ చేసేందుకు జీఏడీకి వెళ్లానని చెప్పారు. ఆయన పీఏకు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వచ్చినట్టుగా చెప్పారు. జీఏడీలో జూనియర్‌ అధికారులుంటారని, సివిల్‌ సర్వీసెస్‌ సంప్రదాయాల ప్రకారం సీనియర్ అధికారులు.. జూనియర్లకు రిపోర్ట్‌ చేయకూడదన్నారు. సీనియర్‌ అధికారి లేకపోతే వారి పీఏకు ఇవ్వాలనడం సంప్రదాయమని తెలిపారు. ఆఫీస్‌లో సీఎస్‌ ఉండి కూడా రిపోర్ట్‌ పేషీలో ఇచ్చేసి వెళ్లిపోమన్నారని చెప్పారు.  బిజీగా ఉంటే రేపు సమయమిచ్చి రమ్మని ఉంటే బాగుండేదన్నారు. తనను కలవడం సీఎస్‌కు ఇష్టం లేదమో అన్నారు. జీఏడీలో రిపోర్ట్ చేయడం వరకే తన పని అని.. అది చేశానని చెప్పారు. 

తన వినతి పత్రం చదివితే కదా అందులో ఏముందో తెలిసేది అని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు సరిచేయాలని కోరేందుకు సీఎస్‌ను కలవాలని అనుకున్నట్టుగా చెప్పారు. రెండేళ్ల సస్పెన్షను సర్వీస్‌గా పరిగణించాలని సీఎస్‌ను అడుగుదామని అనుకున్నానని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి వెయింటింగ్ పీరియడ్ అంటున్నారని.. కానీ రెండేళ్ల సస్పెన్షన్ గురించి మాట్లాడటం లేదన్నారు. ఆర్డర్ సరిచేయకుంటే తాను మళ్లీ కోర్టుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. 

Also Read: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత: జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశం

రెండేళ్ల తర్వాత తనకు న్యాయం జరిగిందని అన్నారు. తన సస్పెన్షన్ చట్టవిరుద్దమని హైకోర్టు చెప్పిందని తెలిపారు. తనను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన జీవోనే తప్పు అని అన్నారు. జీవో ఆర్డర్ అసంపూర్తిగా ఉందని ఆరోపించారు.  తానేం తప్పు చేశానో అధికారులు తేల్చాలని కోరారు. తాను తప్పు చేసి ఉంటే బయటకు చెప్పాలన్నారు. తన జీతం గురించి మాట్లాడేందుకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. పోస్టింగ్ ఇవ్వలేదని.. జీతం ఇచ్చేందుకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. తప్పు చేస్తే శిక్షించాలని లేదా సమయానికి జీతం ఇవ్వాలని కోరారు. కానీ మీడియాలో తనపై బురద వేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. 

ఇక, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ప్రభుత్వం బుధవారంఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి ఏబీవీ సర్వీసు పునరుద్ధరిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని సూచించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే