ప్రియుడితో కలిసి కుమారుడ్ని చంపిన మహిళ: పోలీసులకు ఇలా చిక్కారు

By telugu teamFirst Published Oct 8, 2020, 9:04 AM IST
Highlights

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కన్న కొడుకుని హతమార్చిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. శవాన్ని పాతిపెట్టి వారు సూర్యాపేటకు జిల్లాకు పారిపోయారు.

విజయవాడ: ప్రియుడితో కలిసి కుమారుడిని హత్య చేసిన మహిళ ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కుమారుడిని చంపి కోదాడ సమీపంలో శవాన్ని పాతిపెట్టిన మహిళ ఉషను, ఆమె ప్రియుడు పారిపోయారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారిని తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు వద్ద గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం సమీపంలోని మానుకొండ గ్రామానికి చెందిన ఉష, ఆమె భర్త ప్రసాద్ తాపీ పనులు చేస్తూ జీవనం సాగిస్తూ వచ్చారు వారికి సుకుమార్ (4), అంకిత్ (18 నెలలు) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉషకు కొణిజర్ల మండలం రామనర్సానగర్ కు చెందిన సంపంగి శ్రీను అలియాస్ శివతో పనులు చేసే స్థలంలో పరిచయమైంది. 

Also Read: ప్రియుడిపై మోజు: కొడుకును చంపి పూడ్చిన కసాయి తల్లి

శ్రీనుకు గతంలోనే పెళ్లయింది. ఉష భర్తను, శ్రీను భార్యను వదిలేసి ఇద్దరు కూడా రెండు నెలల క్రితం జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం సాగిస్తున్నారు. ఉష పిల్లలు వీరితోనే ఉంటున్నారు. ఈ నెల 4వ తేదీ రాత్రి పిల్లలు గొడవ చేస్తున్నారనే కోపంతో ఉష ప్రియుడితో కలిసి తీవ్రంగా కొట్టింది. 

ఆ దెబ్బలకు అంకిత్ స్పృహ తప్పి కొద్దిసేపటికే మృత్యువాత పడ్డాడు. పిల్లలకు జ్వరం వచ్చింది, ఆస్పత్రికి తీసుకుని వెళ్తున్నామని చుట్టుపక్కలవాళ్లకు చెప్పి ఇద్దరు ఆటోలో బయలుదేరారు ఉష, శ్రీను మర్నాడు కూడా తిరిగి రాకపోవడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చింది. స్థానికి వీఆర్పోకు, పోలీసులకు అతను సమాచారం ఇచ్చాడు. దీంతో చిల్లకల్లు ఎస్సై వెంకటేశ్వర రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇద్దరిని పట్టుకుని పోలీసులు వారిని విచారించారు. దాంతో వారు నేరాన్ని అంగీకరించారు. బాలుడి శవాన్ని తెలంగాణలోని కోదాడ మండలం చిలుకుూరు గ్రామ సమీపంలోని గుట్టల వద్ద పాతిపెట్టినట్లు అంగీకరించారు. మతృదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్త్రికి తరలించారు. సుకుమార్ కాళ్లపై అట్లకాడతో కాల్చిన గాయాలున్నాయి.

ఉష, శ్రీను అద్దెకు ఉంటున్న ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు ఇంట్లో 40 సెల్ ఫోన్లు లభించాయి. శ్రీను అలియాస్ శివ సెల్ ఫోన్లు, ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

click me!