టీటీడీ కొత్త ఈవోగా జవహర్ రెడ్డి నియామకం

By telugu teamFirst Published Oct 8, 2020, 7:02 AM IST
Highlights

టీటీడీ ఈవోగా ఐఎఎస్ అధికారి జవహర్ రెడ్డి నియమితులయ్యారు. అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో ఆయన టీటీడీ ఈవోగా బదిలీ అయ్యారు. జవహర్ రెడ్డి 9న పదవీబాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (ఈవో) జవహర్ రెడ్డి నియమితులయ్యారు ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 

గురువారం లేదా శుక్రవారం ఆయన టీటీడీ ఈవోగా పదవీబాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. టీడీపీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను ఇటీవలే బదిలీ అయ్యారు ఆయన స్థానంలో జవహర్ రెడ్డి టీటీడీ ఈవోగా నియమితులయ్యారు.

1990 ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన జవహర్ రెడ్డి వివిధ హోదాల్లో పనిచేశారు. 1992 నుంచి 1994 వరకు నర్సాపూర్ సబ్ కలెక్టర్ గా, 1994-96 మధ్య ఐటీడీఏ పీవోగా, 1996-98 మధ్య నల్లగొండ జేసిగా, 1998-99 మధ్య డీపెప్ పీడీగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.

2005-08 మధ్య కాలంలో ఆయన మంచినీటి సరఫరా శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఎండీగా పనిచేశారు. 2008 నుంచి ఐదు నెలల పాటు హైదరాబాదు పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చెర్మన్ గా పనిచేశారు.  2008 నుంచి 2009 వరకు హైదరాబాదు పట్టణాభివృద్ధి శాఖ మెట్రోపాలిటన్ కమిషనర్ గా పనిచేశారు. 2009-10 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. 

2010 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. 2014 నుంచి 20188 వరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్నారు. 2018లో జలవనరుల శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శిగా జవహర్ రెడ్డి 2019లో నియమితులయ్యారు.

click me!