నర్సరావుపేటలో టీడీపీ, వైసీపీ సవాళ్లతో ఉద్రిక్తత: టీడీపీ నేత అరవింద్ బాబు హౌస్ అరెస్ట్

By narsimha lodeFirst Published Mar 22, 2023, 9:33 AM IST
Highlights

పల్నాడు  జిల్లాలోని  నర్సరావుపేట టీడీపీ ఇంచార్జీ  అరవింద్ బాబును  పోలీసులు హౌస్ అరెస్ట్  చేశారు.  కోటప్పకొండకు వెళ్లకుండా అరవింద్ బాబును  పోలీసులు అడ్డుకున్నారు.  టీడీపీ, వైసీపీ మధ్య  సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటు  చేసుకున్నాయి


గుంటూరు: పల్నాడు  జిల్లాలోని  నర్సరావుపేటలో టీడీపీ, వైసీపీ  మధ్య  సవాళ్లు, ప్రతి సవాళ్లతో  ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  వైసీపీ అరాచకాలను  కోటప్పకొండ  ఆలయంలో  ఆధారాలతో  నిరూపిస్తానని  టీడీపీ నేత చదలవాడ  అరవింద్ బాబు  సవాల్  విసిరారు. ఈ సవాల్ కు  నర్సరావుపేట  ఎమ్మెల్యే  గోపిరెడ్డి  శ్రీనివాస్ రెడ్డి  స్పందించారు.  టీడీపీ  ఆరోపణల్లో వాస్తవం లేదని  నర్సరావుపేట ఎమ్మెల్యే  గోపిరెడ్డి  శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు.   కోటప్పకొండ  ఆలయంలో  తాను  కూడా బహిరంగ చర్చకు  సిద్దంగా  ఉన్నట్టుగా  గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు.  అయితే  ఇవాళ  ఉగాది  సందర్భంగా  కోటప్పకొండకు  వచ్చే  భక్తులకు  ఇబ్బంది కల్గించవద్దని  ఎమ్మెల్యే  గోపిరెడ్డి  శ్రీనివాస్ రెడ్డి కోరారు. మరో రోజున  కోటప్పకొండ  ఆలయంలో  చర్చకు తాను సిద్దంగా  ఉన్నానని  గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు. 

నర్సరావుపేట నియోజకవర్గంలో  ఇటీవల టీడీపీ  నేత  హత్య  తర్వాత  నియోజకవర్గంలో  ఉద్రిక్త  పరిస్థితులు  నెలకొన్నాయి.   టీడీపీ  నేత  బాలకోటిరెడ్డి హత్యకు  ఎమ్మెల్యే  గోపిరెడ్డి  శ్రీనివాస్ రెడ్డి  ప్రధాన సూత్రధారి  అని  టీడీపీ  నేత  అరవింద్ బాబు  ఆరోపించారు. మరో వైపు  ఎమ్మెల్యే  గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి  అక్రమాస్తులపై  తన వద్ద ఆధారాలున్నాయని కూడా  అరవింద్ బాబు ఆరోపించారు.

తన సవాల్  మేరకు  బుధవారంనాడు ఉదయం టీడీపీ నేత  అరవింద్ బాబు  కోటప్పకొండకు వెళ్లేందుకు  సిద్దమయ్యారు.  అయితే  అరవింద్ బాబును పోలీసులు హౌస్ అరెస్ట్  చేశారు. కోటప్పకొండకు వెళ్లకుండా అడ్డుకున్నారు.   అయితే  ఇప్పటికే తమ పార్టీకి  చెందిన  కార్యకర్తలు  కోటప్పకొండకు  చేరుకున్నారని  అరవింద్  బాబు  చెప్పారు.

click me!