
అనంతపురం: టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ నేపథ్యంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సహా ఆయన కుమారులు సాయిప్రతాప్, హర్షవర్ధన్ పై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.
also read:తాడిపత్రి ఘటన: జేసీ ప్రభాకర్ రెడ్డికి చంద్రబాబు ఫోన్
ఎమ్మెల్యే పెద్దారెడ్డి సహా మొత్తం 15 మందిపై కేసులు నమోదు చేసినట్టుగా డీఎస్పీ పెద్దారెడ్డి తెలిపారు.తాడిపత్రిలో అల్లర్లకు సంబంధించి మాజీ మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి సహా 27 మందిపై కేసులు నమోదయ్యాయి.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. అయితే తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి లాయర్ చెప్పారు. సీసీపుటేజీ, పెన్ డ్రైవ్, ఓ ఆర్జీని పోలీసులకు ఇచ్చినట్టుగా జేసీ ప్రభాకర్ రెడ్డి లాయర్ శ్రీనివాస్ చెప్పారు.